ఖమ్మంలో టెన్షన్ : సొమ్మసిల్లిన మహిళా కండక్టర్

  • Published By: madhu ,Published On : October 13, 2019 / 05:43 AM IST
ఖమ్మంలో టెన్షన్ : సొమ్మసిల్లిన మహిళా కండక్టర్

Updated On : October 13, 2019 / 5:43 AM IST

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. ఖమ్మం బస్ డిపో వద్ద రోడ్డుపై బైఠాయించారు. కార్మికులకు మద్దతుగా పలు పార్టీలు మద్దతు పలికి నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ కార్మికులు ప్రతిఘటించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కార్మికులను లాక్కెళ్లి వ్యాన్‌లలో పడేశారు.

దీంతో ఓ మహిళా కండక్టర్ సొమ్మసిల్లిపడిపోయింది. వెంటనే అక్కడున్న వారు సపర్యియలు చేపట్టారు. పోలీసుల తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామన్నారు. జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులు చేస్తున్న సమ్మెకు విపక్ష నేతలు మద్దతుగా నిలిచారు. కేసీఆర్ తీరుకు నిరసనగా అక్టోబర్ 19న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. 

మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. అక్టోబర్ 12వ తేదీ శనివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇతడిని ఆర్టీసీ జేఏసీ నేతలు పరామర్శించారు. ప్రభుత్వ వైఖరి వల్లే ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపించారు. 
Read More :