పంపకాలు ఎప్పుడు : విశాఖలో 60వేల తెలంగాణ విగ్రహాలు, శాసనాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయి నాలుగేళ్లు అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య ఇప్పటికే అనేక పంపకాలు జరిగిపోయాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయి నాలుగేళ్లు అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య ఇప్పటికే అనేక పంపకాలు జరిగిపోయాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయి నాలుగేళ్లు అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య ఇప్పటికే అనేక పంపకాలు జరిగిపోయాయి. ఆస్తులు, ఉద్యోగులు, భవనాలు, నిధులు, నీళ్లు.. ఇలా చాలా అంశాల్లో విభజన జరిగింది. ఇప్పుడు చారిత్రక, వారసత్వ సంపద పంపకాల వంతు వచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పురాతన వస్తువులు, శాసనాలు, పురాతన ప్రతిమలు, చారిత్రక విగ్రహాలు పంచుకోవడం మిగిలిపోయింది. వీటిలో దాదాపు 60వేల పురాతన విగ్రహాలు, శాసనాలు ఉన్నాయి.
రాజుల కాలం నాటి విలువైన నాణేలు, ఆయుధాలు ఉన్నాయి. వీటి పంపకం ఎప్పుడు అనేదానిపై క్లారిటీ లేకపోయింది. ప్రస్తుతం ఇవన్నీ విశాఖపట్నంలోని మ్యూజియంలో ఉన్నాయి. ఇవన్నీ పురాతన కాలం నాటివి, విలువైనవి కావడంతో చాలా జాగ్రత్తగా తరలించాలని తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. అందుకే ఆలస్యమైనా పర్లేదని చెబుతున్నారు.
పంపకాలు జరగాల్సినవి:
* విశాఖ మ్యూజియంలో తెలంగాణకు చెందిన 67 పురాతన విగ్రహాలు
* తెలంగాణకు చెందిన 5వేల ఆర్టిక్రాఫ్ట్ సంబంధిత వస్తువులు
* 2, 3 శతాబ్దాలకు చెందిన 50వేల నాణేలు
* రాజుల కాలం నాటి శాసనాలు