కరోనా అలెర్ట్ : నల్గోండ జిల్లాలో బర్మా దేశస్ధుల సంచారం

నల్గోండ జిల్లాలో బర్మా దేశస్ధుల సంచారం కలకలం రేపింది. నార్కట్ పల్లిలో 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి ఒక ఫంక్షన్ హాలులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. జమాతే ప్రార్ధనల్లో పాల్గోని జిల్లాకు వచ్చినవారెవరైనా ఉన్నారా అని పోలీసులు గాలిస్తుండగా వీరు కనపడ్డారు. వీరికి ప్రాధమికంగా ఎటువంటిలక్షణాలు లేనప్పటికీ వీరందరినీ సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Also Read | ఫుల్ రిపోర్ట్ : భారత్ లో ఏయే రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు,మరణాలు