అమ్మవారి అవతారాలు.. పూజిస్తే కలిగే పుణ్యాలు

విజయాలను ఇచ్చే దశమి విజయ దశమి. రోజుకొక అవతారంలో.. 10 రోజులు భక్తులను కరుణిస్తుంది. దశమికి ముందే తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించుకుంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు.
తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాత మూడు రోజులు లక్ష్మీగా, మహాలక్ష్మిగా.. చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. అంటే ముగ్గురమ్మలు కలిసి మూలపుటమ్మగా కొలుచుకుంటారు. తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది.
మొదటి రోజు : శైలపుత్రి
శుక్ల పాడ్యమినాడు శైలపుత్రి. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టీ ఈమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. ఆమే పార్వతీదేవి. శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూలం ధరించి.. హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది.
రెండో రోజు : బాలాత్రిపుర సుందరీ దేవి
ఆశ్వీయుజ శుక్ల విదియ రోజున పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర అనగా ముల్లోకాలు. సుందరి అనగా అందమైనది. త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవతగా పూజలందుకుంటోంది. దక్షిణాదిలో త్రిపుర సుందరీ దేవి పూజలను అమ్మవారి దేవాలల్లోనే పూజించుకుంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయనే ప్రతీతి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన త్రిపుర సుందరీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
మూడో రోజు : గాయత్రీదేవి
వేదాలకు రూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో.. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తూ భక్తులకు దర్శమిస్తుంది. గాయత్రీ ఉపాసాన చేస్తే మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
నాలుగో రోజు : లలితాదేవి
లలితాదేవి అంటే పార్వతి. లక్ష్మీ, సరస్వతుల రూపం. ఈ దేవీ ఉపాసకులకు చాలా ముఖ్యదేవత. లక్ష్మీ సరస్వతులు రెండువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. ఒక చేతిలో చెరుకుగడ, మరో చేతిలో విల్లు, ఇంకోచేతిలో పాశాంకుశాలను ధరించిన పరాశక్తిగా భక్తులతో పూజలందుకుంటోంది. లలితాదేవి.. లక్ష్మీ సరస్వతుల కలియిక కాబట్టి ధనంతో పాటు విద్య లభిస్తుందని విశ్వాసం. లలితాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే విద్య, ధనం, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
ఐదో రోజు : సరస్వతీదేవి
దసరా శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే ది ఐదో రోజు. తెలుపు రంగు తామర పువ్వుపై కూర్చుని వీణ, దండ, కమండలం, అక్షమాల, అభయముద్రతో భక్తులకు దర్శినమిస్తుంది. సంగీత సాహిత్యాలకు..అన్ని విద్యలకు అధిష్టాన దేవత సరస్వతీదేవి. ఈ తల్లిని ఆరాధిస్తే విద్యతో కూడిన సంస్కారం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
ఆరో రోజు : అన్నపూర్ణాదేవి
అన్నపూర్ణాదేవి అన్నం పాత్రతో దర్శమిస్తుంది. అన్నం అంటే ఆయా ప్రాణులు తినే ఆహారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సమస్త ప్రాణి కోటి కడుపులు నింపటమే కాకుండా.. పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. అందరి కడుపులు నింపే అన్నపూర్ణాదేవి. అందుకే అన్నం పెట్టి కడుపు నింపినవారిని అన్నపూర్ణేశ్వరి అని అంటాం. అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న తల్లిని పూజిస్తే ధన ధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయనే విశ్వాసం భక్తులకు ఉంది.
ఏడో రోజు : మహాలక్ష్మీ
గజరాజుల సేవలు అందుకునే శ్రీమహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు. సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. రన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అంటారు.
ఎనిమిదో రోజు : దుర్గాదేవి
పరాశక్తి దుర్గాదేవి. ఎమిదోవ రోజు కనిపిస్తారు. దుర్గముడనే రాక్షసుడిని చంపినట్లు పురాణాలు చెబుతున్నాయి. కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోయే దర్గాదేవిని పూజిస్తే శత్రువుల పీడ పోతుందనే విశ్వాసం. ఎర్రని బట్టలు, అక్షింతలు, ఎర్రటి పుప్వులతో అమ్మను పూజింస్తే సకల శుభాలతోపాటు విజయాలు వస్తాయనే విశ్వాసం ఉంది.
తొమ్మిదో రోజు : మహిషాసుర మర్దినీదేవి
నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా కనిపిస్తుంది. అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ.. సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపిణి దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధిస్తే అన్ని భయాలు పోతాయనే నమ్మకం భక్తులది.
పదో రోజు : రాజ రాజేశ్వరీదేవి
శరన్నవరాత్రుల్లో చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. కమలంపై కూర్చుని దర్శనమిస్తారు అమ్మవారు. రాజరాజేశ్వరీదేవి చేతిలో చెరకు గడ ఉంటుంది. భక్తులకు అభయం ఇస్తూ ఉంటుంది. రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవిగా పిలుస్తారు. ఆమెకే విజయం అని మరో పేరు.
ఇలా 10 రోజులు పది అవతార్లో భక్తులకు దర్శనమిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది విజయదుర్గమ్మ.