కోడ్ ఉల్లంఘన : చంద్రబాబు సమీక్షలపై ఈసీ ఆగ్రహం

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై వివాదం నెలకొంది. ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలు, సమస్యలపై చంద్రబాబు సమీక్షలను ఈసీ తప్పుపట్టింది. సమీక్షలు ఎన్నికల కోడ్

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 10:43 AM IST
కోడ్ ఉల్లంఘన : చంద్రబాబు సమీక్షలపై ఈసీ ఆగ్రహం

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై వివాదం నెలకొంది. ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలు, సమస్యలపై చంద్రబాబు సమీక్షలను ఈసీ తప్పుపట్టింది. సమీక్షలు ఎన్నికల కోడ్

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై వివాదం నెలకొంది. ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలు, సమస్యలపై చంద్రబాబు సమీక్షలను ఈసీ తప్పుపట్టింది. సమీక్షలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళిని అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే అని తేల్చి చెప్పింది. దీంతో చంద్రబాబు హోంశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారు.

పోలింగ్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలన వ్యవహారాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా బుధవారం (ఏప్రిల్ 17,2019) పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు, సీఆర్డీఏ పై సమీక్ష నిర్వహించారు. అధికారులను అడిగి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జులైలో పోలవరం నుంచి నీటిని విడుదల చెయ్యాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు సమీక్షల వ్యవహారం ఈసీ దృష్టికి వెళ్లింది. చంద్రబాబుని తీరుని ఈసీ తప్పుపట్టింది. సమీక్షలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని తేల్చింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించకూడదని చెప్పింది. అధికారులందరికి మరోసారి నియమావళిని పంపింది.
Also Read : షెడ్యూల్ ప్రకారమే Group Exams : అభ్యర్థుల్లో ఆందోళన

పోలింగ్ రోజున (ఏప్రిల్ 11) రాష్ట్రంలో జరిగిన గొడవలు, ఆ తర్వాత జరిగిన ఘర్షణలు, శాంతిభద్రతలపై రివ్యూ చెయ్యాలని చంద్రబాబు అనుకున్నారు. ఈసీ సీరియస్ కావడంతో ఆ రివ్యూని క్యాన్సిల్ చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం ముఖ్యమంత్రి సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించకూడదు. ఇందుకు విరుద్దంగా చంద్రబాబు సెక్రటేరియట్ లో అధికారికంగా పోలవరం, సీఆర్డీఏలపై రివ్యూలు చేశారు.

పోలింగ్ తర్వాత పాలనాపరమైన అంశాలపై దృష్టి పెడతానని చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగా వివిధ అంశాలు, శాఖల పనితీరుపై రివ్యూలు చేస్తున్నారు. తాగునీటి సమస్యపై అధికారులకు సూచనలు చేశారు. చంద్రబాబు రివ్యూలపై రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. ఎన్నికల కోడ్ సమయంలో ఎలా రివ్యూలు చేస్తారని ప్రశ్నించాయి. దీన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. స్పందించిన ఈసీ చంద్రబాబు రివ్యూలను తప్పుపట్టింది.
Also Read : హైదరాబాద్‌లో ఈడీ సోదాలు : రూ.82 కోట్ల విలువైన 146కిలోల బంగారం స్వాధీనం