గిరిజన తండాల్లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పర్యటన

తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గిరిజన ప్రాంతాల్లో అకస్మిక పర్యటన చేశారు. ఏకంగా మంత్రి తమ ముందుకు..రావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. అక్కడున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలవుతున్నాయా ? లేదా ? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి జగదీశ్వర్ రెడ్డికి తెలియచేశారు. జడ్‌పీటీసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు. ప్రచారానికి కాస్తా బ్రేక్ ఇచ్చి…సూర్యాపేటలోని ఎర్కారం తండాలో పర్యటించారు.
ఎర్కారం తండాలో మే 08వ తేదీ బుధవారం మంత్రి జగదీశ్వర్ రెడ్డి పర్యటించారు. తమ ఎదుట మంత్రి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడున్న 73 ఏళ్ల వృద్ధురాలు లోనావత్ సోనితో ముచ్చటించారు. తనకు కంటి సమస్య ఉందని చెప్పింది. కంటి వెలుగు పథకం కింద పరీక్షలు చేయించాలని కింది అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. భూమికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నామని కొంతమంది తెలిపారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో కొత్త సంస్కరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని..దీనివల్ల సమస్యలు పరిష్కారమౌతాయని వారికి తెలిపారు. ఎవరికైతే సొంతంగా ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్ రూం నివాసాలు వచ్చే విధంగా చూస్తామని హామీనిచ్చారు.