ఇకపై వైద్యానికి రూ.5లక్షలు: తెల్ల రేషన్ కార్డు ఉందా?

తెల్ల రేషన్ కార్డు ఉందా? అయితే ఇకపై రూ.5 లక్షల విలువైన వైద్య సేవలను ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. ఇక ఏ ఆసుపత్రిలో అయినా ఏడాదికి రూ.5 లక్షల వరకు వైద్యం చేయించుకుంటే డబ్బు కట్టక్కర్లేదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కొద్దికాలం కిందటే నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం సోమవారం(1 ఏప్రిల్ 2019) నుంచి అమలులోకి వచ్చింది.
ఇంతకుముందు రూ.2 లక్షల విలువైన వైద్య సేవలు అందుబాటులో ఉండగా 2015లో రూ.2.5 లక్షలను ప్రభుత్వం చేసింది. ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు చేయడంతో రోగులకు మేలు జరుగుతుంది. ఈ పథకం ద్వారా ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బు, ఇతర ఖరీదైన వ్యాధుల బారినపడితే ప్రయోజనం పొందుతారని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఇన్‌ఛార్జి సీఈఓ డాక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ఈ నిర్ణయంతో తెల్ల రేషన్‌కార్డు కలిగిన 1.47 లక్షల కుటుంబాలకు ఉపయోగం కలగనుందని చెబుతున్నారు.