శ్రీశైలం జలాశయానికి పొటెత్తుతున్న వరద

అమరావతి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లోకి మళ్లీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కొద్ది రోజులుగా జలాశయాల్లో నిలకడగా ఉన్న నీటి మట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఆల్మట్టికి 6,283వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా…. వచ్చిన నీటిని వచ్చినట్టే అధికారులు కిందకు వదులుతున్నారు. అటు నారాయణపూర్ జలాశయానికి 61,816 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అవుట్ ఫ్లో 65,496 క్కూసెక్కులుగా ఉంది.
శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం 14,529 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 28,728 వేల క్కూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875 అడుగులవద్ద నీరు ఉంది. అటు తుంగభద్ర జలాశయానికి 22,734 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 22,734 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది.
నాగార్జున సాగర్‌కు ఇన్ ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. అయితే అధికారులు 17,382 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుతం 885.70 అడుగుల నీరు నిల్వ ఉంది.