సంక్రాంతి శోభ : పులకించిన పల్లెతల్లి

సంక్రాంతి శోభకు పల్లె పులకించిపోయింది. సంక్రాంతి వేడుకకు మాత్రం పల్లెలకు తరిపోతారు. ఎంత కష్టమైన..ఎంత ఖర్చైనా వెనుకాడకుండా పల్లె ఒడిలో వాలిపోయారు..తనను వదిలి వెళ్లిన బిడ్డలకు తలచుకున్న పల్లెలు సంక్రాంతికి తిరిగి వచ్చే బిడ్డల పాదాలను పల్లె తల్లి తనివితీరా ముద్దాడుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 04:07 AM IST
సంక్రాంతి శోభ : పులకించిన పల్లెతల్లి

Updated On : January 14, 2019 / 4:07 AM IST

సంక్రాంతి శోభకు పల్లె పులకించిపోయింది. సంక్రాంతి వేడుకకు మాత్రం పల్లెలకు తరిపోతారు. ఎంత కష్టమైన..ఎంత ఖర్చైనా వెనుకాడకుండా పల్లె ఒడిలో వాలిపోయారు..తనను వదిలి వెళ్లిన బిడ్డలకు తలచుకున్న పల్లెలు సంక్రాంతికి తిరిగి వచ్చే బిడ్డల పాదాలను పల్లె తల్లి తనివితీరా ముద్దాడుతున్నాయి.

తూర్పుగోదావరి : బతుకు తెరువుకోసం నగరాలకు తరలిపోయిన పల్లెలు మళ్లీ తమ మూలాలను మాత్రం మరిచిపోవు. సంక్రాంతి పడుగకు నగరాలన్నీ పల్లె మట్టి వాసన కోసం పరుగులుపెట్టాయి. పోటీ ప్రపంచంలో తీరిక లేకుండా ఉదయం లేచినప్పటి నుండి ఉరుకులు..పరుగులు పెట్టుకుంటు ఎవరి హడావిడిలో వారు అలసిపోయిన ప్రజలకు సంక్రాంతి వేడుకకు మాత్రం పల్లెలకు తరిపోతారు. ఎంత కష్టమైన..ఎంత ఖర్చైనా వెనుకాడకుండా పల్లె ఒడిలో వాలిపోయారు..తనను వదిలి వెళ్లిన బిడ్డలకు తలచుకున్న పల్లెలు సంక్రాంతికి తిరిగి వచ్చే బిడ్డల పాదాలను పల్లె తల్లి తనివితీరా ముద్దాడుతున్నాయి. సంక్రాంతికి తిరిగి వచ్చిన బిడ్డలకు స్వచ్ఛమైన గాలిని ఇచ్చి..కల్మష్మం లేని ఆత్మీయతను అందిస్తుస్తోంది పల్లెతల్లి. ఏడాదికోసారి ఊరికి ఉత్సవాన్ని తెస్తున్న ఆ బిడ్డను చూసి పులకించిపోయింది. 

పుట్టి పెరిగిన ఊరి గాలి సోకగానే..చిన్నప్పుడు ఆడుకున్న ఆ మట్టి పరిమళం తగలగాతద ఏదో తెలియని ఆనందం..ఉద్వేగం…నూతన ఉత్తేజం ఒక్కసారిగి ముప్పిరిగొనగా ఆమాంతం పల్లెతల్లిని వాటేసుకుని ఏడాదిగా పడిన అలసటను..ఒత్తిళ్లను మరిచిపోయి సేదతీరుతున్నారు ప్రజలు.పైరగాలి తాకగానే తనవు..పచ్చదనాన్ని పరుచుకున్న పొలాల్ని చూసి హృదయం ఉప్పొంగిపోగా..తమకు ఆహ్వానం పలుకే పక్షుల కిలకిలారావాలు.. ఎక్కడో సుదూర తీరాన చెట్టుపై నుంచి లీలగా వినిపిస్తున్న కోయిలమ్మ కూనిరాగాలు…ఇవన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టగా ఇంటి లోగిళ్ల ముందు అత్యంత శోభాయమానంగా స్వాగతం పలికే రంగు రంగుల రంగవల్లికలు..సిగలో గుమ్మడి పువ్వులతో ముస్తాబైన గొబ్బెమ్మలు.. గంగిరెద్దుల సందళ్లు..ముగ్గుల ఒడిలో పులికిపోతున్న దృశ్యాలు ఓహ్…వీటిని మరచి ఎలా బ్రతుకుతున్నామా అనుకుంటు సంక్రాంతి వేడుకల్లో మైనమరచి పోతున్నారు నగరాల నుండి పల్లెలకు తరలిన ప్రజలు. 

భక్తిపారవశ్యంలో హరిదాసు కీర్తనలు..పిండివంటల ఘుమఘుమలు..గుడి వద్ద..వీధుల్ల కూడళ్లలో సరదా రాయుళ్ల పేకాటలు..తోటల్లో కోడి పందేలు.. ఇలా ఇలా ఎక్కడ చూసినా పల్లెలు సంక్రాంతి సందడితో వెలిగిపోతున్నాయి. పండుగ శోభతో పల్లె లోగిళ్లన్నీ వెలిగిపోతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లండ్‌ తదితర దేశాల్లో ఉన్న వారు సైతం కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకొనేందుకు రెక్కలు కట్టుకుని పల్లెతల్లి ఒడిలో వాలిపోయారు. జనవరి 14 భోగి పండుగ కావడంతో గ్రామాల్లో పండగ సందడి పతాక స్థాయికి చేరింది. ఆడపడుచులు ఇళ్ల ముంగిట ముగ్గులతో పోటీ పడుతుంటే మగవారి కోసం కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి.

కుల మతాలకు అతీతంగా ప్రభల తీర్థం
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోనసీమలో సంక్రాంతి పండుగ మూడురోజులూ పెద్ద ఎత్తున ప్రభల తీర్థాలు చూసి తీరవలసిందే. ఒక్క కోనసీమలోనే 90 వరకు తీర్థాలు జరుగుతాయి.  ఈ తీర్థాలలో కోనసీమ సంప్రదాయం ఉట్టిపడుతుంది. అంబాజీపేట మండలం జగ్గన్నతోట, కొత్తపేట, మామిడికుదురు మండలం కొర్లగుంటల్లో జరిగే ప్రభల తీర్థాలకు ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రాంతాలకు వలసపోయినవారు తప్పనిసరిగా వచ్చి తీరుతారు. 20 అడుగుల వెడల్పు, 42 అడుగుల ఎత్తున భారీ ప్రభలను తయారుచేసి కుల, మతాలకు అతీతంగా భక్తులు తీర్థాలకు తరలించుకొస్తారు. పంటపొలాలు, పంట బోదెలు, కౌశికలు దాటుకుని ప్రభలు వచ్చే తీరు అద్భుతంగా ఉంటుంది. కోడి పందేలు ఇప్పటికే జరుగుతుండగా.. పండుగ వేళ భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోడి పందేలకు అనుమతిచ్చేది లేదని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను నిర్వాహకులు లెక్కచేయకుండా కోడిపందేలతో పాటు పొట్టేలు పందేలు, గుండాటలతో పల్లెలు సందడి సందడిగా మారాయి.