హాట్సాఫ్..తెలంగాణ సీఎం కేసీఆర్ : సీఎం జగన్

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 09:50 AM IST
హాట్సాఫ్..తెలంగాణ సీఎం కేసీఆర్ :  సీఎం జగన్

Updated On : December 9, 2019 / 9:50 AM IST

ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎంకు హాట్సాఫ్ చెప్పారు. వరంగల్ హత్యాచారం దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ అని అన్నారు. అసెంబ్లీలో మహిళల భద్రత విషయంపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు..ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ చెప్పారు. 

దిశ దారుణ ఘటన గురించి విన్ననాటి నుంచి తన మనస్సు చలించిపోయిందనీ..ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేసిన వారికి సరైన శిక్ష పడిందన్నారు. అటువంటి దుర్మార్గులను కాల్చేయటమే కరెక్ట్ అన్నారు. తానే కాదనీ.. యావత్ భారతదేశం అంతా ఇదే కోరుకుందన్నారు.

నాకూ ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఒక చెల్లి ఉంది..కానీ ఎప్పుడూ క్షేమంగా ఉండాలనికోరుకుంటున్నాను..అలాగే ఆడపిల్లలు ఉన్న ప్రతీ తండ్రీ ఇలాగే కోరుకుంటారు. ఎన్నో ఆశలతో ఆడపిల్లల్ని పెంచుకుంటాం కానీ వారికి ఏమన్నా జరిగితే ఏ తల్లిదండ్రులు మనస్సు తట్టుకోలేదు. కానీ దిశ ఘటనలో జరిగిన దారుణానికి ఆమె తల్లిదండ్రులు ఎంతగా కుమిలిపోతున్నారో..బాధతో..ఆవేదనతో..ఎంతగా విలపించిపోతున్నారో అర్థం చేసుకోగలన్నారు.

వారి  ఆవేదనను అర్థం చేసుకున్న తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిందనీ..హ్యట్సాఫ్ టూ తెలంగాణా సీఎం కేసీఆర్..హ్యాట్సాఫ్ టూ తెలంగాణ పోలీస్ అని ప్రశ్నించారు సీఎం జగన్. ఇదే సినిమాల్లో జరిగితే అందరం చప్పట్లు కొడతామని మరి రియల్ లైఫ్ లో జరిగితే ఎందుకు విమర్శిస్తున్నారనీ సీఎం జగన్ ప్రశ్నించారు. కానీ జాతీయ మానవహక్కుల సంఘం ఈ ఎన్ కౌంటర్ ని ప్రశ్నిస్తు..దానిపై విచారణ జరపటాన్ని తప్పు పట్టారు సీఎం జగన్. ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం జరిగితే..అప్పుడు లేని మానవహక్కుల సంఘం ఇప్పుడెందుకు చర్యలు తీసుకోవటానికి ఢిల్లీ నుంచి వచ్చిందంటూ ప్రశ్నించారు. 

ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తరువాత నిర్భయ చట్టం ఇటువంటి కేసుల్లో కేవలం నాలుగు నెలల్లో దోషులకు శిక్ష పడాలని చెబుతోంది. కానీ నిర్భయ ఘటన జరిగి ఏడు సంవత్సరాలైనా ఇప్పటి వరకూ దోషులకు శిక్షే పడలేదనీ..ఇదీ మన చట్టాల పరిస్థితి అని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇటువంటి ఎన్ కౌంటర్లే సరి అని అన్నారు.