IPL: లీగ్ చరిత్రలో టాప్ స్కోరర్లు వీళ్లే..

IPL: లీగ్ చరిత్రలో టాప్ స్కోరర్లు వీళ్లే..

Updated On : March 19, 2019 / 3:45 PM IST

ఐపీఎల్ అంటే గుర్తుకొచ్చేది బౌండరీలను శాసించే బ్యాట్స్‌మెన్‌లు, రెప్పపాటున వికెట్లు పడగొట్టే బౌలర్లు. ఈ పొట్టి ఫార్మాట్‌ను బ్యాటింగ్ విభాగమే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది. దూకుడైన బ్యాటింగ్‌తో రెచ్చిపోయే బ్యాట్స్‌మెన్‌లు.. వీర బాదుడికి రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి.

మరి కొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్ 12వ సీజన్ సందర్భంగా ఐపీఎల్ మొత్తంలో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 5 బ్యాట్స్‌మెన్‌ల జాబితా:

క్రిస్ గేల్: 175
విధ్వంసకర ప్లేయర్ వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్..  బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం  వేదికగా ఆరేళ్ల క్రితం బాదిన స్కోరును ఇప్పటి వరకూ ఎవ్వరూ చేధించలేకపోయారు. పూణె వారియర్స్ మీద 2013లో జరిగిన మ్యాచ్‌లో గేల్ రెచ్చిపోయాడు. 66 బంతుల్లో 175పరుగులు చేసి బౌలర్లకు ముచ్చెమటలు పుట్టించాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన స్కోరుతో 30 బంతుల్లో టీ20 సెంచరీ పూర్తి చేసుకుని నయా రికార్డు సృష్టించాడు. 

బ్రెండన్ మెక్‌కల్లమ్: 158
మెక్‌కల్లమ్ దూకుడుని లీగ్ తొలి సీజన్‌లోనే చూపించి ఐపీఎల్ అభిమానుల్లో ట్రెండ్ సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడిన మెక్‌కల్లమ్ 73 బంతుల్లో 158 పరుగులతో విజృంభించాడు. దీంతో కోల్‌కతా 140 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. 

ఏబీ డివిలియర్స్: 133
దక్షిణాప్రికా బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ .. మిస్టర్ 360 రెచ్చిపోయిన దూకుడుకి ఒకే మ్యాచ్‌లో 133 పరుగులను 59 బంతుల్లో పూర్తి చేశాడు. కోహ్లీ భాగస్వామ్యంలో ముంబై ఇండియన్స్‌పై 2015 సీజన్‌లో మెరుపులు కురిపించాడు. ఫలితంగా ముంబై జట్టుపై బెంగళూరు 39 పరుగుల తేడాతో గెలుపొందింది.

డివిలియర్స్: 129
మిస్టర్ 360 మరోసారి 2016వ సీజన్ లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ లయన్స్‍‌పై ఆడిన మ్యాచ్‌లో 52 బంతుల్లోనే 129 పరుగుల చేసి సత్తా చాటాడు. ఈసారి కూడా తనకు భాగస్వామ్యాన్ని అందించింది కెప్టెన్ కోహ్లీనే. ఈ బాదుడుకు గుజరాత్ లయన్స్ 144 పరుగుల భారీ తేడాతో చేతులెత్తేసింది.

రిషబ్ పంత్: 128
ఢిల్లీ జట్టు యువ ప్లేయర్ రిషబ్ పంత్.. అరంగ్రేట సీజన్‌లోనే తానేంటో చూపించేశాడు.  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో 63 బంతుల్లో 128 పరుగులు చేసి బీభత్సం సృష్టించాడు. అంతకష్టపడినప్పటికీ కేన్ విలియమ్స్ సేన హైదరాబాద్ జట్టు 18.5ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించగలిగింది. 

గేల్ పేరిట 2012లోనే 128 పరుగుల రికార్డు ఉంది. 62 బంతుల్లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ముచ్చెమటలు పోయించాడు. ఆ ఇన్నింగ్స్‌కు ఢిల్లీ 21 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.