పవన్ ట్వీట్స్ : ఇదేనా దసరా కానుక

నవరత్నాలతో అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్.. రాష్ట్రాన్ని అంధకారమయం చేసిందంటూ ఫైర్ అయ్యారు జనసేనానీ పవన్ కల్యాణ్. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని పవన్ సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం ట్వీట్ చేశారు.
గత ఏడాది ఇదే నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినప్పుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్.. ఈసారి ఎందుకు విఫలమైందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సర్కార్ సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
Read More : ఆశలు చిగురిస్తున్నాయి : బోటు వెలికితీత పనుల్లో దర్మాడి
ఏ కొత్త ప్రభుత్వమైనా శుభంతో పనులు ప్రారంభిస్తారని, కానీ వైసీపీ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధమైన పనులు చేస్తోందని ఆక్షేపించారు. ఇళ్ల కూల్చివేతలు, పెట్టుబడుల ఒప్పందాలను రద్దు, ఆశా వర్కర్లను రోడ్ల మీదకు తీసుకరావడం, కేసులు పెట్టడం, అమరావతి రాజధాని చెయ్యడం వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు పవన్.
మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుంది?
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు , పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్ల ని రోడ్లు మీదకి తీసుకురావటం , కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం…
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభం తో మొదలుపెడతారు, కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు,పెట్టుబడుల మీద ఒప్పందాలు;
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్.
ఈ నెల 29 వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55 .315 మిలియన్ యూనిట్లు మాత్రమే.— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
* ఏపీ జెన్కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
* 2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఈసారి ఎందుకు విఫలమైంది? సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారు.
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019
ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.
— Pawan Kalyan (@PawanKalyan) September 30, 2019