కేసీఆర్‌కు జాతకాల పిచ్చి ఉంటే మోడీకి ఏం బాధ

భువనగిరి : ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నాకు జాతకాలు, ముహూర్తాల పిచ్చి ఉంటే మోడీకి ఏం బాధ అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 02:35 PM IST
కేసీఆర్‌కు జాతకాల పిచ్చి ఉంటే మోడీకి ఏం బాధ

Updated On : April 2, 2019 / 2:35 PM IST

భువనగిరి : ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నాకు జాతకాలు, ముహూర్తాల పిచ్చి ఉంటే మోడీకి ఏం బాధ అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ

భువనగిరి : ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నాకు జాతకాలు, ముహూర్తాల పిచ్చి ఉంటే మోడీకి ఏం బాధ అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో.. కేసీఆర్ కు జాతకాల పిచ్చి ఉందని ప్రధాని మోడీ విమర్శించారు. ఈ విమర్శలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. భువనగిరిలో ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడారు. ప్రధాని మోడీ సర్పంచ్ స్థాయి కన్నా దిగజారి మాట్లాడారని మండిపడ్డారు. ప్రధాని తీరు బాగోలేదన్నారు.

70 ఏళ్లు బీజేపీ, కాంగ్రెస్ నేతలే దేశాన్ని పాలించారని.. అయినా ఇంకా దేశంలోని కొన్ని గ్రామాల్లో తాగు నీరు అందడం లేదని, విద్యుత్ లేదని కేసీఆర్ అన్నారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉందన్నారు. దేశంలో 3.44 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంటే.. 2 లక్షల మెగావాట్ల విద్యుత్ కూడా వినియోగించుకోవడం లేదన్నారు. నీటిని, విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం అయ్యాయని కేసీఆర్ అన్నారు. ఉన్న నీళ్లను, కరెంట్ ను వాడుకునే తెలివి వారికి లేదన్నారు. ప్రజలను ఆగం చేసేందుకు మోడీ, రాహుల్ యత్నిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. సమస్యలపై నిలదీస్తే మోడీ సమాధానం చెప్పరని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ విద్యుత్, వ్యవసాయ పాలసీలు బాగోలేవన్నారు. మాట్లాడితే మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశం గతి మారాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

జనగామలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. మే నుంచి రెట్టింపు ఫించన్లు అందుతాయన్నారు. యాదాద్రి ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందని, యాదాద్రి పూర్తయితే భునవగిరి ఆర్థిక ముఖచిత్రం మారుతుందని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో 80వేల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత నాది అని కేసీఆర్ చెప్పారు.