చంద్రబాబుపై సెటైర్లు: చంద్రగిరి ప్రచారంలో మంచు విష్ణూ

  • Published By: vamsi ,Published On : April 8, 2019 / 03:54 AM IST
చంద్రబాబుపై సెటైర్లు: చంద్రగిరి ప్రచారంలో మంచు విష్ణూ

Updated On : April 8, 2019 / 3:54 AM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటికే సినిమా వాళ్లు ప్రచారంలోకి దిగి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ తరుపున మంచు మోహన్ బాబు కుటుంబం పలు చోట్ల ప్రచారం చేస్తుంది. అందులో భాగంగా మంచు విష్ణు కూడా పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సపోర్ట్‌గా హీరో మంచు విష్ణూ ప్రచారం చేశారు.

వారం రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న మంచు విష్ణూ.. రోడ్ షోలో పాల్గొని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీని గెలిపించి.. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు.     చంద్రబాబు తమను వలస పక్షులు అంటున్నారని, చంద్రబాబు ఏడాదికి ఒకసారి నియోజకవర్గానికి వస్తారని, మేము వారానికి ఒకసారి ఇక్కడికి వస్తామని విష్ణూ అన్నారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబును ఓడించి జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేయాలని విష్ణూ కోరారు.