కోడెల మృతిపై మంత్రి డౌట్స్ : TS ప్రభుత్వం విచారణ జరపాలన్న బొత్స

  • Published By: veegamteam ,Published On : September 16, 2019 / 10:31 AM IST
కోడెల మృతిపై మంత్రి డౌట్స్ : TS ప్రభుత్వం విచారణ జరపాలన్న బొత్స

Updated On : September 16, 2019 / 10:31 AM IST

కోడెల శివప్రసాద్ మృతిపై సమగ్రంగా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్నిఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. కోడెల మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయనీ.. ముందు హార్ట్ ఎటాక్ అనీ..తరువాత ఆత్మహత్య అని అంటున్నారు. ఇలా పలు విధాలుగా వార్తలు వస్తున్న క్రమంలో విచారణ జరగాలని కోరారు. కోడెల శరీరంపై గాయాలున్నాయా? లేదా అనేది కూడా చూడాలన్నారు.  

ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనీ టీడీపీ ఆరోపిస్తోందనీ..శవ రాజకీయాలు వైసీపీ ఎన్నటికీ చేయదన్నారు. కోడెల వల్ల ఇబ్బందులు పడ్డవారే కేసులు పెట్టారు తప్ప ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టలేదని తెలిపారు.  ఆయన  మృతిపై అనుమానాలు వస్తున్న క్రమంలో సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని సూచించారు. నిమ్స్ ఆస్పత్రికీ గానీ, కేర్ కు గానీ తీసుకెళ్లకుండా క్యాన్సర్ ఆస్పత్రి అయిన బసవతారకం ఆస్పత్రికే ఎందుకు తీసుకెళ్లారు అంటూ బొత్స అనుమానం వ్యక్తంచేశారు.