ఉల్లి@రూ.10వేలు : కర్నూలు మార్కెట్ లో రికార్డు ధర
కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కర్నూలు మార్కెట్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది.

కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కర్నూలు మార్కెట్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది.
కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కర్నూలు మార్కెట్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది. సోమవారం(డిసెంబర్ 2,2019) క్వింటాల్(100 కిలోలు) ఉల్లి ధర రూ.10వేలు పలికింది. ఉల్లి ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. పేద, మధ్య తరగతి వారికి అందుబాటులో లేకుండా పోయింది. ఉల్లి కొనే సాహసం కూడా చేయడం లేదు. బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.100 ఉంది. ఈ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
పెరుగుతున్న ఉల్లి ధరల ప్రభావం ఇళ్లలోనే కాదు రెస్టారెంట్లు, హోటళ్లపైనా ఉంది. ఉల్లిపాయలను రెస్టారెంట్లు సర్వ్ చేయడం లేదు. దాని బదులుగా కీరాని సర్వ్ చేస్తున్నారు. ఒక వేళ ఉల్లిపాయలు కావాలంటే రూ. 15 అదనంగా చెల్లించాలని చెబుతున్నాయి. అంతలా ఉల్లి ఘాటెక్కిస్తోంది. ఉల్లి అమాంతం కొండెక్కి కూర్చోవడంతో బిజినెస్ కూడా డల్‌గా మారిందని రెస్టారెంట్ యాజమాన్యాలు వాపోతున్నాయి.
వేరే ఆప్షన్ లేక ఆ భారం క్రమంగా కస్టమర్లపై వేస్తున్నట్లు చెబుతున్నారు. నగరాలు, పట్టణాల్లో కిలో ఉల్లి ధర రూ.70 నుంచి 80 పలుకుతుండగా కొన్ని చోట్ల ఏకంగా రూ. 100గా ఉంది. దీంతో రెస్టారెంట్లు తమ వంటకాల్లో ఉల్లిని చాలా పొదుపుగా వాడుతున్నాయి. దీంతో రుచి తగ్గడంతో కొందరు కస్టమర్లు రెస్టారెంట్లకు రావడం మానేస్తుండటంతో వారి బిజినెస్ డల్‌గా మారిందని వాపోతున్నాయి యాజమాన్యాలు.
అదనంగా ఉల్లి వంటకాన్ని అడిగితే అదనంగా చెల్లించాల్సిందేనని రెస్టారెంట్ నిర్వాహకులు అంటున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో తమ వ్యాపారాన్ని నిర్వహించడం కష్టంగా మారుతోందని చెబుతున్నారు. దీంతో తమ రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లపై భారాన్ని వేయాల్సి వస్తోందని వాపోతున్నారు. చాలామంది కస్టమర్లు తమ భోజనంలో తప్పనిసరిగా ఉల్లి ముక్కలు కావాలని డిమాండ్ చేస్తుంటారు. దీంతో తమ హోటల్ యాజమాన్యం ఉల్లి అడిగితే ఛార్జీలు అదనమంటూ నోటీసు బోర్డు పెట్టింది. ఉల్లి ముక్కలు అడిగిన కస్టమర్లకు ఒక ప్లేట్ పై రూ.15 అదనంగా ఛార్జ్ చేస్తోంది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు.. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతి వంటింట్లో నిత్యావసరమైన ఉల్లి ధరలు ఈ రేంజ్ లో పెరగడంతో బెంబేలెత్తిపోతున్నారు.
వర్షాలతో ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఉల్లి సరఫరా తగ్గిపోయింది. ఉల్లి ధరలు పెరగడానికి ఇది ప్రధాన కారణం. కాగా, ఉల్లి ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అనేక చర్యలు తీసుకుంటోంది. ఉల్లిని దిగుమతి చేస్తోంది. అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటోంది. అయినా ధరలు మాత్రం కంట్రోల్ కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ ఉల్లిని తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. ప్రజలకు కొంతలో కొంత ఊరటనిస్తున్నాయి.