రాజధానిపై రచ్చ : పవన్ కు అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది : విజయసాయి రెడ్డి

ఏపీ రాజధాని అమరావతి మార్చేస్తారంటూ వస్తున్నాయి. ఈఅంశంపై అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో పవన్‌ది ద్వంద్వ వైఖరని..పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని..కానీ వైసీపీపై అవనసర ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
ఎన్నికలకు ముందు అమరావతి రాజధానికి అనుకూలం కాదని పదే పదే చెప్పిన పవన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల అమరావతిలో పర్యటించిన పవన్ కల్యాణ్ రాజధాని మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మండిపడ్డారు. రాజధాని మార్చితే ఊరుకునే ప్రసక్తే లేదని తీవ్ర హెచ్చరించారు. అదే కనుక జరిగితే ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితులను వివరిస్తానని పవన్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే.