భార్య వేధిస్తోందని నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం 

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 08:56 AM IST
భార్య వేధిస్తోందని నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం 

Updated On : April 3, 2019 / 8:56 AM IST

సిరిసిల్ల : నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బోయిన్ పల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన నక్క నారాయణ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. టెక్స్ టైల్ పార్క్ లో కార్మికుడిగా పనిచేస్తున్న నారాయణ కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  నడి రోడ్డుపై నిప్పంటించుకున్న క్రమంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజుల క్రితం  భార్యకు నారాయణకు మధ్య కొంతకాలంగా విబేధాలు తలెత్తటంతో ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య తనను తీవ్రంగా కొడుతోందంటు నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పీఎస్ కు ఆమెను పిలిచారు. దీంతో తన భర్త తనను వేధిస్తున్నాడనీ పోలీసులకు చెప్పింది. దీంతో వారిద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపివేశారు. ఈ క్రమంలో తనను వేధిస్తు ఎదురు తనమీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తోందని తీవ్ర మనస్తాపానికి గురైన నారాయణ ఈరోజు నడిరోడ్డుపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లుగా తెలుస్తోంది.