ఏపీని వదలా : ప్రచారానికి వస్తున్న మోడీ

ఏపీలో ఎన్నికల ప్రచారంను ముమ్మరం చేసిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించి రంగంలోకి దిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ అగ్ర నేతలు మోడీ, అమిత్ షాలతో ప్రచారం చేయించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ షెడ్యూల్‌ను ఆ పార్టీ ఖరారు చేసుకుంది.
Read Also : పవన్‌కు పృథ్వీ వార్నింగ్: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు
మార్చి 29న ప్రధాని మోడీ కర్నూలులో, ఏప్రిల్ 1వ తేదీన రాజమండ్రిలో భారీ బహిరంగ సభలలో ప్రధాని ప్రసంగించనున్నారు. అందులో భాగంగా ‘మళ్లీ మోడీ’ అనే కరపత్రాన్ని ముద్రించి ప్రజలకు చేరువయ్యేలా ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది.
గత ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఈసారి రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఒంటరిగా పోటీ చేస్తున్నా కూడా కొన్ని సీట్లు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగా బీజేపీకి మోడీ ప్రచారం కలిసొ వస్తుందని భావిస్తున్నారు.