పంటకాలువలో కొట్టుకొచ్చిన 12అడుగుల కొండచిలువ
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేటపాలెంలో కొండచిలువ కలకలం రేపింది.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేటపాలెంలో కొండచిలువ కలకలం రేపింది.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేటపాలెంలో కొండచిలువ కలకలం రేపింది. ఇటీవల కురిసిన వర్షాలకు వరదనీటిలో కొట్టుకువచ్చిన భారీ కొండచిలువను పంటకాలువలో స్థానిక రైతులు చూసి పరుగులు పెట్టారు. ఉదయం పంటపొలాల వద్దకు వెళ్లిన రైతులు కాలువలో దానిని చూసి భయాందోళన చెందారు.
అయితే పొలాల్లో ఆ కొండచిలువ ఉంటే తమ ప్రాణాలకే ప్రమాదమని భావించిన రైతులు.. పెద్దగోనె సంచిలో దానిని పట్టుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. 12అడుగుల పొడవున్న కొండచిలువను చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అటవీశాఖ అధికారులు దానిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు.