కల సాకారం : కాళేశ్వరం పంప్‌హౌజ్‌కు నీరు విడుదల

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 07:41 AM IST
కల సాకారం : కాళేశ్వరం పంప్‌హౌజ్‌కు నీరు విడుదల

Updated On : April 17, 2019 / 7:41 AM IST

తెలంగాణను సస్యశ్యామలం చేయలన్న ధృఢ సంకల్పంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇవాళ కీలక ఘట్టం ఆరంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్యాకేజీ-6 లోని పంపుల వెట్‌ రన్‌ను ప్రభుత్వం నిర్వహించింది. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఎల్లంపల్లి నుంచి ప్యాకేజీ-6లోని గ్రావిటీ కెనాల్‌కు కొంత నీటిని అధికారులు విడుదల చేశారు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు 1.1  కిలోమీటర్ గ్రావిటి కెనాళ్ల ద్వార…9.53 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగిన ట్విన్ టన్నెల్ ద్వార ప్యాకేజీ 6 లోని సర్జ్‌పూల్‌కు నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లతో నీటిని లిస్ట్ చేసి 7వ ప్యాకేజీ కి తరలించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 6వ ప్యాకేజీలోని సర్జ్‌పూల్‌ను విడతల వారిగా నింపుతారు. మొదటగా 10 శాతం తర్వాత 25…50…వంద శాతం వరకు సర్జ్‌పూల్‌ను నింపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

సర్జ్‌పూల్‌ను నీటితో నింపుతున్న క్రమంలోనే టన్నెల్లో ఎక్కడైన లీకెజీలు…ఇతర లోపాలు ఏమైనా తలెత్తుతన్నయా అని ఇంజనీరింగ్‌ల బృందం పరిశీలించనుంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఒక్కో మోటార్‌ను ఆన్ చేస్తూ ఆ మోటర్లలో సాంకేతికపరమైన సమస్యలు ఉంటే వాటిని సవరించుకుంటూ నీటి తరలింపును కొనసాగిస్తుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.