కారులో ’పైసా‘ సినిమా : కుప్పలు కుప్పలుగా కరెన్సీ
నెల్లూరులో జిల్లాలో పైసా సినిమా ఘటన..కారులో కుప్పలు కుప్పలుగా కరెన్సీ, కారు సీట్ల కింద, డిక్కీలో కరెన్సీ కొట్టలు కుప్పలుగా

నెల్లూరులో జిల్లాలో పైసా సినిమా ఘటన..కారులో కుప్పలు కుప్పలుగా కరెన్సీ, కారు సీట్ల కింద, డిక్కీలో కరెన్సీ కొట్టలు కుప్పలుగా
కారులో ’పైసా‘ సినిమా : కుప్పలు కుప్పలుగా కరెన్సీ:
చెన్నై వైపు దూసుకెళుతున్న కారు..
డౌట్ తో కారు ఆపి తనిఖీలు
కుప్పలు కుప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు
అవాక్కయిన పోలీసులు
నెల్లూరు : డైరెక్టర్ కృష్ణవంశీ పైసా సినిమాను తలపించే ఘటన నెల్లూరు జిల్లాలోని తడ వద్ద జనవరి 23న చోటుచేసుకుంది. పైసా సినిమాలో ఆగివున్న కారులో హీరో టీమ్ కు కట్టల కొద్దీ కరెన్సీ దొరికింది. ఇక్కడ కూడా ఇంచుమించు అదే స్థాయిలో సీన్ కనిపించింది. స్పీడ్ గా దూసుకుపోతున్న కారు..దాంట్లో కుప్పలు కుప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు..చూసి అవాక్కయిన పోలీసులు..దుమ్ము కొట్టుకుపోయి ఉన్న ఓ కారు చెన్నై వైపు స్పీడ్ గా దూసుకుపోతోంది. అది చూసిన పోలీసులకు డౌట్ వచ్చింది. వెంటనే సినిమా లెవెల్లో ఛేజ్ చేసి కారును ఆపి తనిఖీలు చేసిన వారు నోరెళ్లబెట్టారు. కారు సీట్ల కింద, డిక్కీలో కరెన్సీ కట్టలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. అనతరంత అక్రమంగా కారులో తరలిస్తున్న రూ.6.5 కోట్ల రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు. కారులో వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఈ పైసా సినిమా స్టోరీ (కారులో కరెన్సీ) ఘనటను వివరించి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి కారులో ఇద్దరు వ్యక్తులు చెన్నైకి వెళ్తుండగా..జనవరి 23 బుధవారం మధ్యాహ్నం ఎస్‌ఐ దాసరి వెంకటేశ్వరరావు సూళ్లూరుపేట నుంచి వస్తుండగా చేనిగుంట జాతీయ రహదారి వద్ద ఓ కారు వేగంగా వెళ్తున్నట్లు గమనించం..డ్రైవర్ సహా మరోవ్యక్తి ఇద్దరు కంగారుగా కనిపించడంతో వెంటనే కారును ఆపి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో రూ.500, రూ.2000 నోట్ల నగదు కట్టలు గమనించి ఇన్ కమ్ ట్యాక్స అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పీస్ కు చేరుకున్న వారు మొత్తం కరెన్సీని లెక్కపెట్టగా విదేశీ కరెన్సీతో కలిపి మొత్తం రూ. 6.5 కోట్లు ఉన్నట్లు నిర్ధారించారు. మరో 55 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నరసాపురానికి చెందిన జైదేవి నగల వ్యాపారి ప్రవీణ్ కుమార్ జైన్ చెప్పడంతో తాము నగదును చెన్నై తీసుకెళ్తున్నట్లు మాచినీడు కనకసురేష్, చేమకూరి హరిబాబు (కారులో వున్న వ్యక్తులు) తెలిపారు. వీరిద్దరు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న తడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.