చంద్రబాబుకి శాపం : నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది

కృష్ణా : ఏపీ సీఎం చంద్రబాబుకి శాపం ఉందని.. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని.. అందుకే చంద్రబాబు తన జీవితంలో నిజం చెప్పలేదని వైసీపీ నేత షర్మిల

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 12:03 PM IST
చంద్రబాబుకి శాపం : నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది

Updated On : April 2, 2019 / 12:03 PM IST

కృష్ణా : ఏపీ సీఎం చంద్రబాబుకి శాపం ఉందని.. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని.. అందుకే చంద్రబాబు తన జీవితంలో నిజం చెప్పలేదని వైసీపీ నేత షర్మిల

కృష్ణా : ఏపీ సీఎం చంద్రబాబుకి శాపం ఉందని.. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని.. అందుకే చంద్రబాబు తన జీవితంలో నిజం చెప్పలేదని వైసీపీ నేత షర్మిల అన్నారు. గుడివాడలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబుపై షర్మిల విరుచుకుపడ్డారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా అని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు.

విక్టరీ సింబల్ గా చంద్రబాబు చూపించే రెండు వేళ్లపై షర్మిల సెటైర్ వేశారు. అది విక్టరీ సింబల్ కాదన్నారు. తనది రెండు నాల్కల ధోరణి అని చెప్పడానికే.. చంద్రబాబు అలా రెండు వేళ్లు చూపిస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధికి ఊపిరి అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చారని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబుకి మళ్లీ అధికారం ఇస్తే ప్రత్యేక హోదా మాట వినిపించదన్నారు. చంద్రబాబుది రోజుకో మాట, పూటకో వేషం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ స్టేటస్ సాధన కోసం జగన్ మాత్రమే ఎన్నో పోరాటాలు చేశారని షర్మిల చెప్పారు.

చంద్రబాబు లాంటి వ్యక్తి పౌరుషం, రోషం గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉందని షర్మిల అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు చెయ్యని ప్రయత్నం లేదన్నారు. ఆఖరికి హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకుని పొత్తుల కోసం దిగజారిపోయారని అన్నారు. కేసీఆర్ తో పొత్తు కోసం ప్రయత్నించినప్పుడు చంద్రబాబు పౌరుషం, రోషం ఏమైందని షర్మిల నిలదీశారు. బీజేపీతో, టీఆర్ఎస్ తో వైసీపీకి పొత్తులు లేవని.. సింహం సింగిల్ గానే బరిలోకి దిగుతుందని షర్మిల స్పష్టం చేశారు. లోకేష్ కు జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియదని విమర్శించారు. ఏ అర్హత, అనుభం ఉందని లోకేష్ కు మూడు మంత్రి పదవులు ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు.