ప్రయాణికుల రద్దీ : గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  మే 5, 12, 19, 26 తేదీల్లో గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్‌ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి ఏప్రిల్ 9 మంగళవారం తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 05:17 AM IST
ప్రయాణికుల రద్దీ : గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

Updated On : April 10, 2019 / 5:17 AM IST

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  మే 5, 12, 19, 26 తేదీల్లో గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్‌ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి ఏప్రిల్ 9 మంగళవారం తెలిపారు.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  మే 5, 12, 19, 26 తేదీల్లో గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్‌ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి ఏప్రిల్ 9 మంగళవారం తెలిపారు. రైలు(నెం.07049) ఆయా తేదీల్లో మచిలీపట్నంలో 15.05 గంటలకు బయలు దేరి సికింద్రాబాద్‌ 22.45 గంటలకు చేరుకుంటుంది.
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ

తిరుగు ప్రయాణంలో రైలు(నెం.07050) సికింద్రాబాద్‌లో రాత్రి  23.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.55 గంటలకు మచిలీపట్నం చేరుతుందని తెలిపారు. అదేవిధంగా నర్సపూర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రత్యేక రైలు(నెం.07258) ప్రతి ఆదివారం నర్సపూర్‌లో 18.00 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 04.45కు హైదరాబాద్‌ చేరుకుంటుందని వెల్లడించారు.
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్