స్టూడెంట్స్ లవ్ వార్ : ఒకే అమ్మాయిని ప్రేమించిన యువకులు..కత్తులతో దాడి

నెల్లూరు జిల్లాలో స్టూడెంట్స్ మధ్య ప్రేమ కోసం యుద్ధం జరిగింది. ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. కోవూరులో జరిగిన ఈ ప్రేమ వ్యవహారం ఇద్దరి విద్యార్ధుల మధ్యా గ్యాంగ్ వార్ గా మారింది. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునేవరకూ వెళ్లింది.
వివరాల్లోకి వెళితే..కొవలూరు మండలం ఎన్నాయిపాలెంకు చెందిన నాయబ్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. కొంతకాలం తరువాత వారిద్దరు విడిపోయారు. అదే యువతిని షారుఖ్ అనే మరో యువకుడు ప్రేమించాడు. ఈ క్రమంలో నాయబ్, షారుఖ్ ల మధ్యా గొడవలు నడుస్తున్నాయి.
దీంతో ఆదివారం నాయబ్ అతని స్నేహితులు అవినాష్, ప్రమోద్ లతో కలిసి రాజుపాలెం నుంచి నెల్లూరుకు సినిమాకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన షారుఖ్ అతని స్నేహితుడు శనత్ గౌడ్ తో మరికొందరు వ్యక్తులతో కలిసి రామన్నపాలెం పెట్రోల్ బంక్ వద్ద కాపు కాచారు. నాయబ్ ని అడ్డుకున్నారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అదికాస్తా ఘర్షణకు దారి తీసింది. దీంతో రెచ్చిపోయిన షారుఖ్ నాయబ్ పై కత్తులతో దాడికి పాల్పడ్డాడు.
స్నేహితుడ్ని రక్షించేందుకు అవినాష్, ప్రమోద్ లు అడ్డుకోగా వారికి కూడా కత్తిపోట్లు తగిలాయి. ఇంతలో అటువైపుగా పెట్రోలింగ్ వాహనం రావటంతో షారుఖ్ అతని గ్యాంగ్ పారిపోయారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన నాయబ్, అతని స్నేహితులను గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఈ గ్యాంగ్ వార్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షారుఖ్ అండ్ గ్యాంగ్ కోసం గాలింపును ముమ్మరం చేశారు.