జగన్‌పై బాబు ఆగ్రహం : 26 కేసులు పెట్టారు..ఏం చేయగలిగారు

ఏపీ సీఎం జగన్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. టీడీపీ నాయకులను కాదు..మీ బాబాయ్ చంపినోళ్లను అరెస్టు చేయ్..వైఎస్సార్ తనపై 26 కేసులు పెట్టారు..ఏం చేయగలిగారు అంటూ ప్రశ్నించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దంటూ మరోసారి అక్కసు వెళ్లగక్కారు బాబు. అక్టోబర్ 14న తేదీ సోమవారం నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు.
జగన్ వస్తే నీళ్లు రాలేదు..నేను పనులు చేస్తే నీళ్లొచ్చాయని చెప్పారు. రైతులకు రూ. 12 వేల 500 ఇస్తామని మాటమార్చారని, ఇప్పటి వరకు రైతు భరోసా లబ్దిదారులను గుర్తించలేదన్నారు. రైతు భరోసా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులకేనా అంటూ విమర్శలు చేశారు. గ్రామ కార్యదర్శి పోస్టులు కూడా వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారని ఆరోపించారు. కార్యకర్తల జీతాల కోసం ప్రజలపై పన్ను వేస్తారా అని ప్రశ్నించారు.
జిల్లాల పర్యటనకు బాబు వెళుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అక్టోబర్ 14వ తేదీ సోమవారం నెల్లూరు జిల్లాకు వచ్చారు. తొలి రోజు జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను క్రియాశీలం చేసే నిమిత్తం ఆయన ఈ పర్యటనలు చేస్తున్నారు. వచ్చేవారం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు బాబు.
Read More : దేశంలోనే ఫస్ట్ టైమ్ : రూ.6వేల కోట్లతో ఏపీలో కొత్త పథకం