ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే

  • Published By: vamsi ,Published On : December 16, 2019 / 12:57 AM IST
ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే

Updated On : December 16, 2019 / 12:57 AM IST

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పాలకొల్లు నుంచి శివదేవుని చిక్కాల వరకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు.

పాలకొల్లు బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న అనంతరం బస్సు ఛార్జీల పెంపుపై విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా నిమ్మల రామా నాయుడు మాట్లాడుతూ.. పెరిగిన ఆర్టీసీ ఛార్జీల కారణంగా ప్రజలపై రూ.వెయ్యికోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. ప్రభుత్వం పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

నిరుపేద ప్రజలు ప్రయాణించే పల్లెవెలుగు బస్సులపై కనిష్ఠ ఛార్జీని 50 శాతం పెంచడం కరెక్ట్ కాదని రామానాయుడు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని మండిపడ్డారు.