వైసీపీ ఎంపీకి టీడీపీ సపోర్ట్ : తిరగబడ్డ యోధుడు అంటూ ప్రశంసలు

పార్లమెంట్‌లో తెలుగు గురించి మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురైన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. 10టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన తెలుగుదేశం నాయకులు మాల్యాద్రి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించారు. విచారణ చెయ్యకుండా వైసీపీ వాళ్లు ఎంపీ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదని అన్నారు చర్చలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాల్యాద్రి.
వైసీపీ వాళ్లు పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. మాతృభాషా పరిరక్షణ కోసం ఓ పోరాట యోధులు లాగా, తెలుగు భాష కోసం తిరగబడ్డ యోధుడు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ ప్రశంసించింది. గోదావరి జిల్లాలకు, క్షత్రియులకు గర్వకారణం రఘురామ కృష్ణంరాజు అని అన్నారు. తెలుగు భాషను, అమ్మ భాషను గౌరవించే ఎవరినైనా తెలుగు దేశం పార్టీ సపోర్ట్ చేస్తుందని ఆయన అన్నారు.
ఇక ఇదే సమయంలో చంద్రబాబును తిట్టినందుకు నజరానాగా తెలుగు అకాడమీ ఛైర్మన్ పదవి ఇచ్చారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవనాలను తెలంగాణకు అప్పగించినప్పుడు తెలుగు అకాడమీ భవనాలను ఎందుకు విభజించలేదని విమర్శించారు. 2017లో పైలట్ ప్రాజెక్ట్‌గా మున్సిపల్ స్కూళ్లలో టీడీపీ ఇంగ్లీష్ ప్రవేశపెడితే, పిల్లలు స్కూళ్ల నుంచి డ్రాప్ అవుట్ అవుతారని వైసీపీ వాళ్లు మాట్లాడారని, నారాయణ గారికి స్కూళ్లను అప్పగించేందుకు ఇలా చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు.
ఇప్పుడు అమ్మ ఒడిలో కోత కొయ్యడానికి పేద ప్రజలను డ్రాప్ అవుట్ అయ్యేలా చెయ్యడానికి ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.