టీడీపీదే విజయం, 130 స్థానాలు కైవసం : చంద్రబాబు జోస్యం

అమరావతి : ఏపీలో ఓట్ల పండుగ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ పోలింగ్ శాతం నమోదైంది. 80శాతం

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 02:36 AM IST
టీడీపీదే విజయం, 130 స్థానాలు కైవసం : చంద్రబాబు జోస్యం

Updated On : April 12, 2019 / 2:36 AM IST

అమరావతి : ఏపీలో ఓట్ల పండుగ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ పోలింగ్ శాతం నమోదైంది. 80శాతం

అమరావతి : ఏపీలో ఓట్ల పండుగ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ పోలింగ్ శాతం నమోదైంది. 80శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. గెలుపుపై చంద్రబాబు, జగన్ ఇద్దరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గెలుపు మాదే అంటే.. మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వందకి వంద శాతం మళ్లీ టీడీపీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గురువారం(ఏప్రిల్ 11, 2019) అర్ధరాత్రి టీడీపీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పారు. ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలన్నారు. స్ట్రాంగ్‌ రూంల దగ్గర  40 రోజులు షిఫ్టుల వారిగా కాపలా కాయాలన్నారు. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read Also : APలో ఓట్ల వర్షం : 80 శాతం పోలింగ్!

ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైసీపీ పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడిందని చంద్రబాబు ఆరోపించారు. వారి దిగజారుడుతనానికి ఇది నిదర్శనం అన్నారు. అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా 200 బూత్‌లలో పోలింగ్‌ సాగుతోందని… మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈ పరిస్థితి కల్పించారని చంద్రబాబు వాపోయారు. కార్యకర్తలు, ప్రజలే ఓటింగ్‌ సరళిని కాపాడారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు టీడీపీ పక్షాన నిలిచారని చంద్రబాబు చెప్పారు.

జగన్ కూడా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 80శాతానికి పైగా నమోదైన పోలింగ్ శాతం తమకే అనుకూలం అని, భారీ మెజార్టీతో వైసీపీ గెలుపు ఖాయమని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతిమంగా ఓటర్ దేవుడు ఎవరిని కరుణాంచాడు అన్నది తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.
Read Also : బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్