వికారిలోనే ఎంట్రీ : ఉగాది రోజే టీడీపీ, వైసీపీ మ్యానిఫెస్టోలు
అమరావతి : చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికలకు మూడు రోజుల ముందు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లు ఒకే రోజున మ్యానిఫెస్టోలను రిలీజ్ చేయబోతున్నాయి.

అమరావతి : చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికలకు మూడు రోజుల ముందు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లు ఒకే రోజున మ్యానిఫెస్టోలను రిలీజ్ చేయబోతున్నాయి.
అమరావతి : చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికలకు మూడు రోజుల ముందు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లు ఒకే రోజున మ్యానిఫెస్టోలను రిలీజ్ చేయబోతున్నాయి. ఉగాది రోజునే రెండు పార్టీల మ్యానిఫెస్టోలు విడుదల కానున్నాయి. అమరావతిలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను టీడీపీ ప్రముఖంగా ప్రస్తావించనుంది. అదేరోజున అమరావతిలో వైసీపీ మ్యానిఫెస్టోను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. నవ రత్నాలు, పాదయాత్ర హామీలతో మ్యానిఫెస్టో రూపలకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించిన పథకాలకుతోడుగా మరిన్ని ప్రకటించే అవకాశం ఉంది.
రెండు పార్టీల అగ్రనేతలు ప్రజల సమక్షంలోనే హామీలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే అన్నీ హామీలను ప్రకటించారు. అయితే నామమాత్రంగానే మ్యానిఫెస్టోల విడుదల కార్యక్రమం ఉంటుందని చెప్పవచ్చు. సీపీఎస్ విధానం రద్దు చేస్తామని రెండు అగ్ర నేతలు ఇప్పటికే ప్రకటించారు.
Read Also : నేటికి 46ఏళ్లు : ఫస్ట్ మొబైల్ ఫోన్ కాల్ ఎవరు, ఎవరికి చేశారో తెలుసా?
టీడీపీ ఎన్నికల ముందే పెన్షన్ రూ.2 వేలకు పెంచింది. జగన్ కూడా నవ రత్నాల పేరుతో ఏడాదిన్నరపాటు ప్రజల్లో తిరిగారు. నవరత్నాల్లో రూ. 2 వేలు పెన్షన్ చేస్తానని చెప్పారు. ఈలోపే టీడీపీ రూ.3 వేలు పెన్షన్ ఇస్తామని ప్రకటించడంతో.. జగన్ కూడా రూ.3 వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు చంద్రబాబు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చే రూపాయలను 5లక్షలకు పెంచుతామని అంటున్నారు. అదేవిధంగా చంద్రన్న బీమాను పది లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పట్టణ పేదలకు పది లక్షల విలువైన ఇళ్లను ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోని గృహాల బకాయిలను పూర్తిగా మాఫీ చేస్తామని అంటున్నారు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తామని చెప్పారు. ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు 15 వేలు ప్రకటించారు. వాటికి సంబంధించి నిన్న 45 లక్షల మంది రైతుల అకౌంట్ లలో రూ.3 వేల చొప్పున వేశారు.
బడికి వెళ్లే పిల్లలకు 15 వేల రూపాయలు ఇస్తామని జగన్ ప్రకటించారు. నవరత్నాల పేరుతో రైతులకు పెట్టుబడిసాయం రూ.12500 వేలు ఇస్తామన్నారు. వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే అది ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకెళ్తానని జగన్ ప్రకటించారు. ఫీజు రియింబర్స్ మెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తానని, ఎస్సీ, ఎస్టీలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు జగన్. రెండు పార్టీలు ఒకే రోజు మ్యానిఫెస్టోలను విడుదల చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also : ప్రపంచం మెచ్చింది : నా కోడిపిల్లను కాపాడండీ.. పాకెట్ మనీతో ఆస్పత్రికి పరిగెత్తిన బుడతడు