నారా లోకేష్‌పై పోటీకి దిగిన తమన్నా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ అందరి చూపు కూడా మంగళగిరి నియోజకవర్గంపైనే పడింది. ఇప్పుడు ఈ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల హీట్ మొదలవగా.. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుండి ట్రాన్స్‌జెండర్ తమన్నా నామినేషన్ వేశారు. మంగళగిరి నియోజకవర్గం నుండి తమన్నా సింహాద్రి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ప్రజా సేవ చెయ్యాలనే సంకల్పంతో పోటీ చేయ్యాలని భావిస్తున్నట్లు తమన్నా సింహాద్రి చెప్పారు. జనసేన పార్టీ నాకు టిక్కెట్ ఇస్తుందని భావించానని, ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గం నుండి ట్రాన్స్‌జెండర్‌లు పోటీ చేయాలని ఆమె కోరారు. సవాళ్లు ప్రతిసవాళ్లతో ఎన్నికల కురుక్షేత్రంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల హీట్ పెరిగింది. మరోవైపు నియోజకవర్గం నుండి జనసేన కూడా చల్లా శ్రీనివాస్‌ను బరిలోకి దింపింది.