పాపం పసిగుడ్డు : అట్టపెట్టెలో పెట్టి వదిలేశారు

  • Published By: veegamteam ,Published On : November 11, 2019 / 05:40 AM IST
పాపం  పసిగుడ్డు : అట్టపెట్టెలో పెట్టి వదిలేశారు

Updated On : November 11, 2019 / 5:40 AM IST

కడుపున పుట్టిన బిడ్డల్ని అనాథలుగా చేస్తున్న ఘటనలు కొనసాగుతున్నాయి. నవమాసాలు మోసి కన్న పేగును వీధుల పాలు చేస్తున్నారు. చెత్తకుప్పల పాలు చేస్తున్నారు. పసిగుడ్డుల ప్రాణాలను నడివీధుల్లో పడేస్తున్నారు. ఇటువంటి మరో ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

విజయవాడలోని శిశుభవన్ గేటు దగ్గర ఓ అట్టపెట్టెలో నాలుగు నెలల పసిగుడ్డుని వదిలి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ బిడ్డ ఏడుపు విన్న శిశుభవన్ సిబ్బంది గేటు వద్దకు వచ్చి చూడగా అక్కడ ఓ అట్టెపెట్టెలో ఉన్ని బిడ్డ ఏడుస్తూ కనిపించింది. దీంతో ఆ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.  

ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమచారం అందించారు. పాప అస్వస్థతగా ఉండటంతో హుటా హుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఆ పసిగుడ్డును వదిలి పెట్టిన అట్ట పెట్టె చిన్నారికి చలి వేయకుండా ఓ దుప్పటి..ఓ పాల సీసాను కూడా పెట్టి వదిలివేసారు గుర్తు తెలియని వ్యక్తులు.