రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తాం : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

వైకుంఠ ఏకాదాశికి పది రోజులు ద్వారాలు తెరిచే ప్రతిపాదనను టీటీడీ విమరమించుకుంది. రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 10:55 AM IST
రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తాం : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Updated On : December 19, 2019 / 10:55 AM IST

వైకుంఠ ఏకాదాశికి పది రోజులు ద్వారాలు తెరిచే ప్రతిపాదనను టీటీడీ విమరమించుకుంది. రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

వైకుంఠ ఏకాదాశికి పది రోజులు ద్వారాలు తెరిచే ప్రతిపాదనను టీటీడీ విమరమించుకుంది. రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గత సంప్రదాయాలనే పాటిస్తామని చెప్పారు. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 19, 2019) ఆయన మీడియాకు వివరించారు. తిరుమలలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని ఆగమ పండితులు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు..ఆలయంలో చేసే మార్పులను ఆయనకు వివరించారు. 

వైకుంఠ ఏకాదశి రోజున పది రోజులపాటు ద్వారాలు తెరవడం, ఉత్సవ విగ్రహాల అరుగుదల తదితర అంశాలను ఆయనకు వివరించారు. స్వరూపానంద నుంచి పలు సూచనలు, సలహాలు తీసుకుంది. తర్వాత వెలుపలికి వచ్చిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు గత సంప్రదాయాలను అమలు చేస్తామని మీడియాకు చెప్పారు. వైకుంఠ ఏకాదశి రోజున పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరుస్తారని గత కొద్దిరోజులుగా మీడియాలో ప్రచారం జరిగింది. 

వీటిన్నింటికీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెరదించుతూ వైకుంఠ ద్వారాలు రెండు రోజులే తెరుచుకొని ఉంటాయని స్పష్టం చేశారు. స్వరూపానందస్వామి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల విశ్వాసలకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని టీటీడీకి సూచించారు. ఇటీవల చినజీయర్ స్వామి సైతం పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని సూచించారు. వీటన్నింటిపై డిసెంబర్ 28న జరిగే పాలక మండలి సమావేశంలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.