మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లో ఉరి పడాలి : సీఎం జగన్

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 10:20 AM IST
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లో ఉరి పడాలి : సీఎం జగన్

Updated On : December 9, 2019 / 10:20 AM IST

ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులకు కేవలం మూడు వారాల్లో ఉరి శిక్ష పడాలని, అలాంటి చట్టాలు రావాలన్నారు సీఎం జగన్. షాద్ నగర్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటనను ఉటంకిస్తూ..అత్యాచారాలకు..హత్యలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులకు మూడు వారాల్లోగా ఉరి శిక్ష పడేవిధంగా చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం ఉన్న చట్టాల్సిన సవరించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం మహిళల భద్రత బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చర్చ జరిగింది. జగన్ మాట్లాడుతూ…

ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో వారం రోజుల్లోపు ఇన్వెష్టిగేషన్ మొత్తం కంప్లీట్ చేసేసి..పోస్ట్ మార్టం రిపోర్ట్..డీఎన్ఏ రిపోర్ట్.. ఇలా కేసుకు సంబంధించిన అన్ని విచారణలు పూర్తయి పోవాలన్నారు. రెండు వారాల్లోగా…కేసుకు సంబంధించిన అన్ని విషయాలను పూర్తి చేసి 21 వర్కింగ్ డేస్‌ల్లో..అంటే కేవలం మూడు వారాల్లోగా నిందితులకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ చట్టపరంగా పూర్తి చేసి ఉరి వేయాలని అన్నారు.  

అలా జరిగితేనే ఆడవారిపై హింసలు..దారుణాలు ఆగుతాయన్నారు. అటువంటి చట్టాలు నేటి పరిస్థితుల్లో చాలా అవసరమన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులను చిదిమేస్తున్నారనీ ఇలాంటి దుర్మార్గులు భూమి మీద బ్రతికి ఉండటానికి వీల్లేకుండా పటిష్టమైన చట్టాలు అవసరమన్నారు.

అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం జగన్. నేరాలకు తగిన శిక్ష వెంటనే అమలు జరిగితే దారుణాలు ఆగుతాయని, ఈ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం జగన్ అన్నారు. దీని కోసం ప్రతీ జిల్లాలోను డెడికేటెడ్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. దారుణమైన నేరాలకు పాల్పడేవారికి ఈ కోర్టుల ద్వారా వెంటనే శిక్ష పడాలన్నారు.  దీనికోసం చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.