చంద్రబాబు నువ్వు మగాడివైతే రా..: పిన్నెల్లి

  • Published By: chvmurthy ,Published On : January 7, 2020 / 09:20 AM IST
చంద్రబాబు  నువ్వు మగాడివైతే రా..: పిన్నెల్లి

Updated On : January 7, 2020 / 9:20 AM IST

ప్రజాప్రతినిధులు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోడ్డులో వస్తే వాళ్లపై దాడి చేయటానికి ముందుగానే  చంద్రబాబు నాయుడు అక్కడ మనుషులను పెట్టుకుని  నాపై దాడి చేయించాడని పిస్తోందని అన్నారు  మాచర్ల  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. రోడ్డమీద ధర్నాచేసే రైతుల వద్దకు అప్పటికప్పుడు రాళ్లు, కర్రలు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై ఎస్పీకు ఫిర్యాదు చేస్తానని  పిన్నెల్లి చెప్పారు.  

 

గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో  మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  కారుని అమరావతి రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారు నుంచి కిందకు దిగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ముందు బైఠాయించారు. ఈ క్రమంలో కొందరు రాళ్లతో కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది పైనా చేయి చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 

తనపై దాడి జరిగిన తర్వాత పిన్నెల్లి  విలేకరులతో మాట్లాడుతూ..  ఏదో రకంగా మమ్మల్ని భయపెట్టటానికి చంద్రబాబు  నాయుడు ప్రయత్నం చేస్తూ  తనకు అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు గుండాగిరీకి పాల్పడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.   రాజధాని రైతుల ముసుగులో చంద్రబాబు చేస్తున్న దురాగతాలను ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.
Also Read : అల్లర్లు, అరాచకాలు సృష్టించటం చంద్రబాబుకు అలవాటే 

“మా గన్ మెన్ ను కొట్టారు…మా గన్ మెన్ కు దెబ్బలు తగిలాయి…అక్కడ ఉన్నవాళ్లు అంతా తాగి ఉన్నారు..నా కారు డ్యామెజి చేస్తే సమస్య పరిష్కారం కాదు కదా…ఫ్రీ ప్లాన్డ్ గా చంద్రబాబు రాజధాని రైతులు ముసుగులో కొందరిని రెచ్చగొడుతున్నాడు అని పిన్నెల్లి అన్నారు.  మావను వెన్నుపోటు పొడిచి అధికారంలోకివచ్చిన  చంద్రబాబు నాయుడు, తెరచాటు రాజకీయాలు కాక తెరముందుకు వచ్చి మాతోమాట్లాడాలని సవాల్ విసిరారు.