Bride Teasing Groom On Stage : పెళ్లిలో వరుడ్ని ఆటపట్టించిన వధువు

పెళ్ళి వేడుక అంటేనా చాలా సరదాగా ఉంటుంది. రెండు దశాబ్దాలకు ముందు పెళ్లి వేడుక అంటే బంధుమిత్రులంతా ఒక చోట చేరతారు. ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉంటారు. అమ్మలక్కలు ఒక పక్క పనుల్లో హడావిడిగా ఉంటే మొగాళ్లంతా ఒక పక్కచేరి చతుర్ముఖ పారాయణం చేపడతారు. ఇంక పిల్లల అల్లరికి అంతే ఉండదు.

Bride Teasing Groom On Stage : పెళ్లిలో వరుడ్ని ఆటపట్టించిన వధువు

Bride Teasing Groom On Stage

Updated On : July 25, 2021 / 4:02 PM IST

Bride Teasing Groom On Stage : పెళ్ళి వేడుక అంటేనా చాలా సరదాగా ఉంటుంది. రెండు దశాబ్దాలకు ముందు పెళ్లి వేడుక అంటే బంధుమిత్రులంతా ఒక చోట చేరతారు. ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉంటారు. అమ్మలక్కలు ఒక పక్క పనుల్లో హడావిడిగా ఉంటే మొగాళ్లంతా ఒక పక్కచేరి చతుర్ముఖ పారాయణం చేపడతారు. ఇంక పిల్లల అల్లరికి అంతే ఉండదు.

కానీ ఈ మధ్య అలాంటి హడావిడి తగ్గి మ్యారేజి రిసెప్షన్ లోనే అంతా సందడి సందడి చేస్తున్నారు.  అక్కడే వధూవరుల స్నేహితులు వచ్చి వారితో కలిసి సందడి చేస్తున్నారు. ఆటపట్టిస్తున్నారు. కొన్నిసార్లు వధూవరులు కూడా వేదికపై చేసే వింత పనులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నవ్వు తెప్పిస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన పెళ్లి వేడుకలో వధువు వరుడ్ని ఆటపట్టించటం తెగ వైరల్ అవుతోంది,

వివరాల్లోకి వెళితే ఓ పెళ్ళి వేడుకలో రిసెప్షన్ జరుగుతోంది. స్టేజిమీద వధూవరులు వచ్చారు. దండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. ఈలోపు అమ్మాయి బంధువులు కొందరు వచ్చి అమ్మాయి చెవిలో గుసగసలాడారు. వధువుకు ఏమి చెప్పారో ఏమో అందరూ స్టేజి దిగి కిందకువెళ్లారు. మొదట వరుడి మెడలో వధువు దండ వేసింది. తర్వాత వరుడు వధువు మెడలో పూలమాల వేయాలి.

కాబోయే మొగుడ్ని ఆటపట్టించాలనుకుంది. పెళ్లి కొడుక్కి అందకుండా తల వెనక్కు జరుపుకుంది. వరుడు కొంచెం ముందుకొచ్చాడు. ఇసారి వధువు ఇంకొంచె వెనక్కి వెళ్ళింది. వరుడు ఉత్సాహంగా ముందుకురాగా అతనికి చిక్కకుండా తప్పించుకుంది. పెళ్లి కొడుక్కి చిక్కకుండా స్టేజి మీద తప్పించుకు తిరగసాగింది. అటు ఇటూ పరిగెత్తుతూ పట్టుకోమన్నట్లు సవాల్ విసిరింది.

వధువు మెడలో పూలదండ వేయటానికి పెళ్లి కొడుకు కూడా ఉత్సాహంగా పరిగెత్తాడు.  కానీ అతని వల్ల కాలేదు. చివరకు వరుడి బంధువులు కొంత సహాయం చేయటంతో వధువు మెడలో మాల వేశాడు. ఈ వీడియోను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మనీశ్‌ మిశ్రా అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా తెగ వైరలవుతోంది.

దీనిపై నెటిజన్లు వెరైటీగా స్పందించారు. ‘‘ఇది ఆటలు ఆడే స్థలం కాదు.. కొద్దిగా పక్కకు వెళ్లి ఆడుకోండమ్మా!’’ అంటూ ఒకనెటిజన్ చమత్కరించాడు. ఇక మరో నెటిజన్‌ ‘‘ఇద్దరి చెవుల్లో​ గుసగుసలు మొదలైనపుడే అనుకున్నాను. ఏదో తిక్క పని చేస్తారు.’’ అని అంటూ ఘాటుగా స్పందించాడు.