Viral Video: అచ్చం బాడీ బిల్డర్‌లా పోజులు ఇచ్చిన కంగారూ

వన్యప్రాణులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంటాయి. వాటిలో కొన్ని ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లను అలరిస్తుంటాయి. వన్యప్రాణులు విచిత్రంగా ప్రవర్తిస్తే ఆ వీడియోలు మరింత వైరల్ అవుతుంటాయి. ఇటువంటి వీడియోనే ఇది. ఓ కంగారూ బాడీ బిల్డర్ లా కనపడి అలరించింది.

Viral Video: అచ్చం బాడీ బిల్డర్‌లా పోజులు ఇచ్చిన కంగారూ

Viral Video

Updated On : December 29, 2022 / 4:00 PM IST

Viral Video: వన్యప్రాణులకు సంబంధించిన ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంటాయి. వాటిలో కొన్ని ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లను అలరిస్తుంటాయి. వన్యప్రాణులు విచిత్రంగా ప్రవర్తిస్తే ఆ వీడియోలు మరింత వైరల్ అవుతుంటాయి. ఇటువంటి వీడియోనే ఇది. ఓ కంగారూ బాడీ బిల్డర్ లా కనపడి అలరించింది. ఫొటోలు తీస్తుంటే మనుషులు సాధారణంగా రకరకాల పోజులు ఇస్తారు.

బాడీ బిల్డర్లు వారి కండలను చూపిస్తూ ఫొటోలు దిగుతారు. తమను ఫొటోలు తీస్తున్నారని తెలిస్తే చాలు మరింత హుషారయిపోతారు. అచ్చం ఇలాగే ప్రవర్తించింది ఓ కంగరూ. ఓ వ్యక్తి ఫొటోలు తీస్తుండగా అది బాడీ బిల్డర్ లా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యపర్చింది. హెర్సీ.దహిల్16 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

దీన్ని పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఆ కంగారూ బాడీ కూడా బాగా అలరిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కంగారూ శరీరాకృతి విభిన్నంగా ఉందని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ఇటువంటి బాడీ తనకూ ఉంటే బాగుండునని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by HER ŞEY DAHİL (@hersey.dahil16)

Minister Nirmala Sitharaman: ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నిర్మలా సీతారామన్