Steaming: వైరల్ వీడియో: ఆవిరి పట్టడంలో కొత్త విధానం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కరోనాను ఎదురుకునేందుకు పాతపద్ధతులను అనుసరిస్తున్నారు.

Steaming: వైరల్ వీడియో: ఆవిరి పట్టడంలో కొత్త విధానం

Steaming

Updated On : May 22, 2021 / 4:24 PM IST

Steaming: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కరోనాను ఎదురుకునేందుకు పాతపద్ధతులను అనుసరిస్తున్నారు. చాలామంది ఆయుర్వేదంలో వాడే మూలికలను కరోనా వైద్యంలో వినియోగిస్తున్నారు. అయితే కొందరు కరోనా రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారు పాతకాలం నాటి ఆవిరి విధానాన్ని అనుసరిస్తున్నారు. కొందరు ఆవిరిపట్టేందుకు మట్టి కుండలను ఉపయోగిస్తున్నారు. పాత్రలలో నీటిని వేడి చేసుకొని ఆవిరి పట్టుకుంటున్నారు.

అయితే ఓ వ్యక్తి ఆవిరి పట్టడంలో కొత్త విధానాన్ని కనుగొన్నాడు. పప్పు కుక్కర్ లో వాటర్ పోసి దాని ద్వారా ఆవిరి పడుతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదట కుక్కర్ లో వాటర్ పోసి దానిని పొయ్యిమీద పెట్టాడు.. దానికో పైపు తగిలించాడు. పైపు ద్వారా ఆవిరి బయటకు వస్తుండగా దాని ముందు నిల్చొని ఆవిరి పట్టాడు. అతడు ఆవిరిపట్టే విధానాన్ని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.