Viral Video: కూతురిని వీడియో తీస్తూ తండ్రి ఇచ్చిన రియాక్షన్ వైరల్
ముద్దు ముద్దు మాటలు పలికే కూతురిని చూసి తండ్రి మురిపోతుంటాడు. కూతురి ఎదుగుదల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు చాలా మంది తండ్రులు. ఇక ఆ కూతురు ప్రయోజకురాలైతే ఆ తండ్రికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. తాజాగా, ఓ తండ్రీకూతుళ్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఓ యువతి ఇంగ్లిష్ లో చెవి పోగుల గురించి మాట్లాడుతూ తన తండ్రిని వీడియో తీయాలని కోరింది.

Viral Video
Viral Video: ముద్దు ముద్దు మాటలు పలికే కూతురిని చూసి తండ్రి మురిపోతుంటాడు. కూతురి ఎదుగుదల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు చాలా మంది తండ్రులు. ఇక ఆ కూతురు ప్రయోజకురాలైతే ఆ తండ్రికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. తాజాగా, ఓ తండ్రీకూతుళ్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఓ యువతి ఇంగ్లిష్ లో చెవి పోగుల గురించి మాట్లాడుతూ తన తండ్రిని వీడియో తీయాలని కోరింది.
దీంతో, స్మార్ట్ ఫోన్లో తన చిట్టితల్లి వీడియో తీస్తూ, ఆమె మాటలు వింటూ ఆ తండ్రి ఇచ్చిన రియాక్షన్స్ అలరిస్తున్నాయి. ఈ వీడియోను ఆ యువతి పోస్ట్ చేస్తూ.. ‘‘చెవి పోగుల గురించి నేను మాట్లాడుతుండగా మా నాన్న నన్ను చూస్తే స్పందించిన తీరు ఇలా ఉంది.
నేను, నా తోబుట్టువులు బడిలో చదువు కొనసాగిస్తున్న సమయంలో ఇంగ్లిష్ లోనే మాట్లాడాలని నా తండ్రి చెబుతుండేవారు. ఇంగ్లిష్ భాష ప్రాధాన్యం గురించి ఆయనకు తెలుసు. ఇవాళ ఆయన నన్ను గర్వంగా, ప్రేమతో చూస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను’’ అని చెప్పింది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని తెలిపేలా ఈ వీడియో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
Zika Virus In Karnataka : కర్ణాటకలో జికా వైరస్ తొలి కేసు.. ఐదేళ్ల చిన్నారిలో గుర్తింపు