కుక్కలు, పిల్లులు కూడా రక్తదానం చేయొచ్చు

కుక్కలు, పిల్లులు కూడా రక్తదానం చేయొచ్చు

Updated On : November 28, 2019 / 7:38 AM IST

రక్తదానం చేసి ఓ ప్రాణాన్ని కాపాడొచ్చనే సంగతి అందరికీ తెలుసు. మనుషుల్లో రక్త బదిలీ జరిగినట్లు కుక్కల్లో, పిల్లుల్లోనూ చేయొచ్చంట. ఈ విషయం తెలియక జంతు ప్రేమికులు ఎందరో వారి కుక్కలు, పిల్లుల ప్రాణాలు కోల్పోతున్నారు. అనీమియా లాంటి వ్యాధులు, కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తీవ్ర గాయాలకు గురై పెంపుడు జంతువులు చనిపోతుంటాయి. 

Dogs and Cats Can Donate Blood

వారికి అవగాహన లేకనే వాటిని కోల్పోతున్నారని నిజానికి కుక్కలు, పిల్లులు కూడా రక్తదానం చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డా.కరెన్ హమ్(రాయల్ వెటర్నర్ కాలేజీ, యూకే) మాట్లాడుతూ.. ‘పెంపుడు జంతువుల యజమానులు వారి జంతువులను ఎంతగానో ప్రేమిస్తారు. ఇతరుల జంతువులకు సాయం చేసేందుకు సిద్ధంగానే ఉంటారు. రక్తదానం చేస్తే ఇతర జంతువులకు ఎంతసాయం చేయగలమో వారికి తెలుసు’ అని వెల్లడించారు.

Dogs and Cats Can Donate Blood మనుషులకు ఉన్నట్లుగానే జంతువుల్లోనూ రక్తంలో వేరే గ్రూపులు ఉంటాయట. పైగా వీటి నుంచి రక్తం తీసుకునేందుకు వెటర్నరీ డాక్టర్ సాయంతో అది బ్లడ్ డొనేట్ చేయగలదా.. దాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. ఎంతవరకూ ఇవ్వగలదు. ఆ రక్తం వేరే కుక్కకు మ్యాచ్ అవుతుందా అనేది పరీక్షిస్తారట. ఇలా కుక్కలకు రక్తదానం ఇస్తున్న సమయంలో కంటే పిల్లులకు ఇస్తున్నప్పుడే ఎక్కువ ఇబ్బంది అవుతుందని బ్లడ్ డొనేషన్ క్యాంపు సిబ్బంది చెబుతున్నారు.

 జంతువులు తమంతట తామే రక్తదానానికి రాలేవని, వాటి యజమానులే పశువుల రక్తదానంపై అవగాహన ఏర్పరచుకుని ముందుకు రావాలని బ్లడ్ డొనేట్ క్యాంపులు పిలుపునిస్తున్నాయి. మనుషుల్లానే రక్తదానం చేస్తే మరింత వేగంగా శరీరానికి రక్తం సమకూరుతుందని పరిశోధకులు చెప్పుకొస్తున్నారు. 

Dogs and Cats Can Donate Blood