so.. cute : తలపై అందమైన పువ్వుతో బుజ్జి బాతు కునుకు

  • Published By: nagamani ,Published On : September 29, 2020 / 04:47 PM IST
so.. cute : తలపై అందమైన పువ్వుతో బుజ్జి బాతు కునుకు

Updated On : September 29, 2020 / 5:23 PM IST

so cute :  duckling dozes off in flower hat, video goes viral : బుల్లి బుల్లి బాతు పిల్లలు భలే క్యూట్‌గా ఉంటాయి కదూ. గునగునా అమ్మ వెనకే నడుస్తుంటే కళ్లప్పగించి చూస్తాం. అటువంటిది ఈ బుజ్జి బాతుపిల్ల కునుకు తీసే విధానం చూస్తే అబ్బా..ఎంత ముద్దుగా ఉంది? సో క్యూట్..అంటూ మురిసిపోవాల్సిందే.



ఇదిగో ఈ వీడియోలో ఉన్న బాతు పిల్ల తలపై అందమైన పువ్వు పెట్టుకుని భలే నిద్రపోతోంది. దాని తలపై ఓ వ్యక్తి పువ్వు పెట్టగానే అది ఎలా నిద్రపోయిందో చూడండి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆ బాతు పిల్ల అలా కునుకు తీయడం చూసినవారు తెగ మురిసిపోతున్నారు.



49 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో ఒక బాతుపిల్ల అటూ ఇటూ క‌ద‌ల‌కుండా కామ్‌గా కూర్చొని కునికిపాట్లు పడుతోంది. ప‌క్క‌నే మ‌నిషి ఉన్నా కూడా బాతుపిల్ల ఏమీ బెదరలేదు.

 

కునికిపాట్లు మానలేదు.బాతుపిల్ల త‌ల‌మీద ఒక పువ్వును పెట్ట‌గానే గొడుకు ప‌ట్టిన‌ట్లుగా హాయిగా నిద్ర‌పోతున్న‌ది. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా చ‌క్క‌ర్లు కొడుతుంది.