ప్లాస్టిక్ స్ట్రా బ్యాన్ : కొబ్బరిబొండా నీళ్లు తాగేదెలా?! 

కొబ్బరిబొండా తాగేందుకు వాడే ప్లాస్టిక్ స్ట్రాల వాడకంపై నిషేధం విధించారు.. కొబ్బరిబొండాలు ఎట్టా తాగాలి? స్ట్రా లేకుండా అని ఆలోచిస్తున్నారా? మీకోసమే ఈ న్యూస్..

  • Published By: sreehari ,Published On : January 13, 2019 / 01:31 PM IST
ప్లాస్టిక్ స్ట్రా బ్యాన్ : కొబ్బరిబొండా నీళ్లు తాగేదెలా?! 

Updated On : January 13, 2019 / 1:31 PM IST

కొబ్బరిబొండా తాగేందుకు వాడే ప్లాస్టిక్ స్ట్రాల వాడకంపై నిషేధం విధించారు.. కొబ్బరిబొండాలు ఎట్టా తాగాలి? స్ట్రా లేకుండా అని ఆలోచిస్తున్నారా? మీకోసమే ఈ న్యూస్..

కొబ్బరిబొండా.. ఆరోగ్యానికి చాలా మంచిది. సమ్మర్ అయితే ఇంకా మంచిది. ఎండదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాహాన్ని తీరుస్తుంది. ఎన్నో పోషక విలువులున్న కొబ్బరిబొండాను ఇష్టపడనివారు ఉండరు. రోడ్ల పక్కన కొబ్బరి బొండాలు కనిపిస్తే చాలు.. వెంటనే వెళ్లి కొని తాగేస్తుంటారు. కొబ్బరిబొండాలు అమ్మేదుకాణం దగ్గర తాగేందుకు ప్లాస్టిక్ స్ట్రాలు ఉంటాయి కదా? అవి ఇకపై కనిపించవు. తమిళనాడు ప్రభుత్వం కొత్త ఏడాది జనవరి 1 నుంచి ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. దీంతో ఇతర ప్లాస్టిక్ వస్తువులతో పాటు కొబ్బరిబొండా తాగేందుకు వాడే ప్లాస్టిక్ స్ట్రాలు వాడటం నిషిద్ధం. మరి.. కొబ్బరిబొండాలు ఎట్టా తాగాలి? స్ట్రా లేకుండా అని ఆలోచిస్తున్నారా? ఒక దారి మూతపడితే మరో దారి తెరుచుకుంటుంది. 

ప్లాస్టిక్ స్ట్రా లేకుంటేనే.. ప్రకృతి నుంచి లభించే స్వచ్ఛమైన వస్తువులు ఉన్నాయి కదా అంటున్నారు దుకాణాదారులు. కొబ్బరిబొండాలు అమ్మేవారంతా కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తమ దుకాణాల దగ్గర ప్లాస్టిక్ స్ట్రాలకు బదులుగా బొప్పాయి బొంగులు, వెదురు బొంగులు పెడుతున్నారు. అంతేకాదండోయ్.. రోడ్డుపక్కన కొబ్బరిబొండాలమ్మే బండ్ల వద్ద అరటి ఆకులు, మండ్రాయి ఆకులు స్ట్రాలుగా దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ స్ట్రాలతో పొలిస్తే ఇవి కాస్తా పెద్దదిగా ఉన్నప్పటికీ.. ఒక లాగుడుకే బొండాలోని నీళ్లన్నీ నోట్లోకి వెళ్లిపోవాల్సిందే. బాగుంది కదా? ఐడియా. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది అన్నట్టుగా దీనికో పరిష్కారం దొరికిందిలే.