డేంజరస్ ‘సాల్ట్ ఛాలెంజ్’.. టిక్‌టాక్‌లో ట్రెండింగ్

టిక్ టాక్ లో ఇప్పటివరకు ఉన్న చాలెంజ్‌లు సరిపోవనట్లు.. సాల్ట్ చాలెంజ్ పేరుతో మరో కొత్త చాలెంజ్ వచ్చి చేరింది. దీనివల్ల ఏరికోరి ప్రమాదాలను తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఛాలెంజ్ లో నోటి నిండా ఉప్పు వేసుకోవాలి. జొనాథన్ అనే టిక్‌టాక్ యూజర్ ఈ చాలెంజ్‌ను టిక్‌టాక్‌కు పరిచయం చేశాడు. ఇంకఅంతే అందరూ దీన్ని ఫాలో అవుతున్నారు.
ఈ ఛాలెంజ్ చాలా ప్రమాదమని.. ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం శరీరానికి మంచిది కాదని నిపుణుల చెబుతున్నారు. దీనివల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలూ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాదు అది విషంగా మారి వాంతులు అవుతాయట. ఈ ఛాలెంజ్ ఇంత ప్రమాదకరమైనప్పటికీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
See Also | సీజ్ చేసిన SUVలో పోలీసుల జాయ్ రైడ్.. GPSతో కారు లాక్ చేసి 3 గంటలు చుక్కలు చూపించిన యజమాని!
అంతేకాదు ఈ మధ్య ఫోన్ ఫ్లాష్ ను నేరుగా కళ్లలోకి కొట్టుకోవడం కూడా ట్రెండ్ అవుతోంది. దీనివల్ల కళ్ల రంగు మారుతుందని టిక్‌టాక్ యూజర్ల భ్రమ. అయితే ఇది కళ్లకు అంత మంచిది కాదని.. దీనివల్ల శాశ్వతంగా కళ్లుపోయే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిపై నెటిజన్లు ఇవేం చాలెంజ్‌లురా బాబూ అని నెత్తి పట్టుకుంటున్నారు.
@okayimjonathan salt challenge!! this was disgusting ? ##foryoupage ##foryou ##featurethis ##viral