జర భద్రం: బహిరంగ ప్రదేశాల్లో ఈ పనులు చేస్తే శిక్ష తప్పదు

దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదయ్యాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, పొగ తాగడం మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగంచడం లాంటివి చేస్తే శిక్ష తప్పదని ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ టోపే ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం, పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులను వినియోగించడం శిక్షించదగిన నేరాలని చెప్పారు.
వీటిల్లో ఏ నేరమైన చేస్తే.. వ్యక్తి రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక రోజు ప్రజాసేవ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అదే నేరం రెండోసారి చేస్తే.. రూ.3,000 జరిమానా చెల్లించి మూడు రోజులు ప్రజా సేవ చేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఆ తరువాత శిక్ష 5000 రూపాయల జరిమానా మరియు ఐదు రోజుల ప్రజా సేవ అవుతుంది అని ఆయన చెప్పారు.
ఇది కాకుండా.. ఈ శిక్షలతోపాటు బోంబే పోలీస్ యాక్ట్, భారత శిక్షా స్మృతి (IPC) ప్రకారం దాదాపు 6 నెలల నుంచి రెండేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించవచ్చు. ఇక శుక్రవారం రాత్రి వరకు మహారాష్ట్రలో 62వేల 228 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.