Rains In Telangana : బుధ,గురువారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు
ఆగస్టు 3,4 బుధ, గురువారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంధ్రం అధికారులు హెచ్చరించారు.

Telangana Weather Report
Rains In Telangana : ఆగస్టు 3,4 బుధ, గురువారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంధ్రం అధికారులు హెచ్చరించారు. ఉత్తర, దక్షిణ ద్రోణి ఆదివారం నాడు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా కొమరం ప్రదేశం వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆగస్టు 3, 4 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులుతెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ప్రతి రోజు వర్షం కురుస్తుంది. ఆదివారం నాడు ఉత్తర తెలంగాణ జిల్లాలైన జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలలో భారీ వర్షం కురియగా హైదరాబాద్ లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 31, 2022