స్థిరంగా అల్పపీడనం : ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు దీని ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉంది. సోమ, మంగళవారాల్లో తెలంగాణతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఏపీలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులు దాటింది. ఇన్‌ఫ్లో 2లక్షల 53 వేల క్యూసెక్కులు ఉండగా…. జూరాల నుంచి లక్షా 63వేల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 86వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మరో 13 టీఎంసీల నీరు చేరితే… శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరుకుంటుంది. ఎగువ నుంచి భారీ వరద కొనసాగుతున్నందున గేట్లు ఎత్తే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు.
ఎగువన కురుస్తున్న అతి భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నదులు ఉగ్రరూపాన్ని దాల్చాయి. ఓ పక్క కృష్ణా.. మరోవంక గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రిజర్వాయర్లు, బ్యారేజీలు నిండుకుండల్లా మారిపోయాయి. తెలంగాణలో భద్రాచలం దగ్గర గోదావరి నది ప్రమాదకర హెచ్చరికలను దాటి ప్రవహిస్తోంది. ఇక్కడ నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 45 అడుగులకు పైగా చేరింది. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలు నీట మునిగాయి. గోదావరి పరిసర ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు.