పొగ మంచు..చలిగాలులు వీస్తున్నాయి

హైదరాబాద్ : ఉత్తారఖండ్, అస్సాం, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో దట్టంగా పొగ మంచు అలుముకొంటోంది. కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. రాగల 24గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం. ఇక తెలంగాణ విషయానికి వస్తే చలిగాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల 24గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం పొగమంచు కురుస్తోంది. పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట వేడి..రాత్రి వేళల్లో చలి గాలులు వీస్తున్నాయి.