AP Rains: ఏపీకి వాయుగండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

AP Rains: ఏపీకి వాయుగండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

Updated On : October 22, 2025 / 12:18 AM IST

AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తీరం వెంట గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. మిగతా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిసింది.