Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు
గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉందంది.
Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు జిల్లాల్లో అకాల వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ఉదయం 8గంటల 30 నిమిషాలలోపు వడగళ్ల వానలు పడే అవకాశం ఉందంది. అలాగే భారీగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది.
రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉందంది.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హాట్ సమ్మర్ లో వానలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు అకాల వర్షాలతో కాస్త సేద తీరుతున్నారు.
అయితే ఈ అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. కోతకు సిద్ధంగా పంట వాన నీటిలో తడిసిపోతోంది. పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Also Read: చికెన్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. రేపటి నుంచి చికెన్ షాపులు బంద్.. ఎందుకు, ఎప్పటివరకు అంటే
