MLAs Purchase Case: ఈ నెల 17న ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ.. సీబీఐ విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత డిసెంబరు 26న హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించింది.

MLAs Purchase Case: ఈ నెల 17న ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ.. సీబీఐ విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

MLAs Purchase Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈ నెల 17న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత డిసెంబరు 26న హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

Google Bard: ‘చాట్‌జీపీటీ’కి పోటీగా గూగుల్ ‘బార్డ్’.. బ్లాగ్ ద్వారా వెల్లడించిన సుందర్ పిచాయ్

దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, వచ్చిన అప్పీళ్లను విచారించబోమని డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మళ్లీ దీన్ని సవాలు చేస్తూ మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా ఈ తీర్పుపై మూడు వారాలు స్టే ఇవ్వాలని కోరింది. దీన్ని విచారించిన కోర్టు స్టే ఇవ్వలేమని, సుప్రీంకోర్టులో స్టే కోసం ప్రయత్నించాలని సూచించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నిర్ణయంపై స్టే ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.

Rajma Chawal Tattoo: చేతిపై రాజ్మా చావల్ టాటూ.. నెటిజన్ల రియాక్షన్ ఏంటో తెలుసా?

ఒకసారి కేసు ఫైల్ సీబీఐకి వెళ్తే పిటిషన్ నీరుగారిపోతుందని ప్రభుత్వం వాదించింది. ఈ కేసుకు సంబంధించి దస్త్రాలు ఇవ్వాలని ఇప్పటికే సీబీఐ ఒత్తిడి తెస్తోందని, ఈ కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే లేదా స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసుపై ఈ నెల 17న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. అదే రోజు అన్ని అంశాలు పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

కేసులో మెరిట్స్ ఉంటే, సీబీఐకి ఇచ్చిన డాక్యుమెంట్స్ వెనక్కు ఇవ్వాలని ఆదేశిస్తామని కూడా చెప్పింది. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా 17వ తేదీ కంటే ముందే విచారణ చేపట్టాలని కోరింది ప్రభుత్వం. అయినప్పటికీ సుప్రీం ధర్మాసనం దీనికి నిరాకరించింది. ఈ నెల 17న విచారణ చేపడుతామని చెప్పింది.